Anushka Upcoming Movie: మలయాళ మూవీలో అనుష్క.. ఏకంగా 14 భాషల్లో రిలీజ్..!

Anushka new movie: టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క ఓ మలయాళ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న ఈ మూవీ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2023, 04:27 PM IST
Anushka Upcoming Movie: మలయాళ మూవీలో అనుష్క.. ఏకంగా 14 భాషల్లో రిలీజ్..!

Anushka Malayalam Movie: తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్క(Anushka Shetty).. ఇప్పుడు తొలిసారి మాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. 'కథనార్-ది వైల్డ్ సోర్సెరర్'(kathanar: the wild Sorcerer) అనే హార్రర్ మూవీ ద్వారా మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనుష్క. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మలయాళ స్టార్ హీరో జయసూర్య లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుష్క అరుందతి తరహా పాత్ర చేయబోతుందని సమాచారం. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. మెుదటి పార్ట్ 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని మెుత్తంగా 14 భాషల్లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News