పెళ్లి కొడుకుగా ముస్తాబైన ఆర్‌‌ఎక్స్ 100 హీరో కార్తికేయ

Karthikeya and Lohitha wedding pics: తన స్నేహితురాలైనన లోహితను.. కార్తికేయ ప్రేమ వివాహం (Karthikeya love marriage) చేసుకోబోతున్నారు. రాజా విక్రమార్క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే తనకి కాబోయే భార్య లోహిత‌కు (Lohitha) ప్రపోజ్ చేసి ఆమెను అంద‌రికీ పరిచ‌యం చేశాడు. 

Last Updated : Nov 20, 2021, 03:18 PM IST
  • రేపే హీరో కార్తికేయ వివాహం
  • తన స్నేహితురాలు లోహితతో కార్తికేయ ప్రేమ పెళ్లి
  • పెళ్లికొడుకుగా ముస్తాబైన కార్తికేయ
పెళ్లి కొడుకుగా ముస్తాబైన ఆర్‌‌ఎక్స్ 100 హీరో కార్తికేయ

Tollywood Hero Karthikeya and Lohitha wedding pics going viral: ఆర్‌‌ఎక్స్ 100 మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్‌‌ని (Tollywood‌) షేక్ చేసిన యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కార్తికేయ. తాజాగా రాజావిక్రమార్క అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తన స్నేహితురాలైనన లోహితను.. కార్తికేయ ప్రేమ వివాహం (Karthikeya love marriage) చేసుకోబోతున్నారు. రాజా విక్రమార్క మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనే తనకి కాబోయే భార్య లోహిత‌కు (Lohitha) ప్రపోజ్ చేసి ఆమెను అంద‌రికీ పరిచ‌యం చేశాడు. 

రాజా విక్రమార్క వేడుకలో హీరో కార్తికేయ తన ప్రేమకథ గురించి వేదికపై చెప్పారు. లోహితకు తొలుత తానే ప్రపోజ్‌ చేశానని.. తన జీవితంలో హీరోగా నిలదొక్కుకోవడానికి పడినంత స్ట్రగుల్‌ ఆమె ప్రేమ కోసం పడ్డానని చెప్పుకొచ్చారు. తన బెస్ట్‌ఫ్రెండ్‌, గర్ల్‌ఫ్రెండ్‌ (Girlfriend) నుంచి భార్యగా (Wife) తన జీవితంలోకి ఆమె ప్రవేశించబోతుంది అంటూ కార్తికేయ తెలిపారు.

Also Read : ఖబడ్దార్... విర్రవీగితే మెడలు వంచుతాం... వైసీపీ నేతలకు నందమూరి బాలకృష్ణ వార్నింగ్

ఇక కార్తికేయ, లోహిత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 21న ఉద‌యం 9 గంట‌ల 47 నిమిషాల‌కు వీరి వివాహం జరగనుంది. పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ (Wedding) కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లోహిత, కార్తికేయల ఎంగేజ్‌మెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది.

మరికొద్ది గంటల్లో లోహిత మెడ‌లో మూడు ముళ్లు వేసి ఆమెను త‌న అర్ధాంగిగా మార్చుకోనున్నాడు కార్తికేయ. కార్తికేయ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. కార్తికేయ (Karthikeya) పెళ్లి వేడుకకు పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు హాజ‌రు కానున్నారు. తెలుస్తోంది.

Also Read : ఎన్టీఆర్ షోలో మహేశ్ బాబు సందడి..త్వరలోనే ప్రసారం.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News