Tiger Nageswara Rao - Custody: ఒకేసారి ఆ భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన రవితేజ, నాగ చైతన్య చిత్రాలు..

Tiger Nageswara Rao - Custody: గత కొన్నేళ్లుగా అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా (భారత్) చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా.. ఆయా భాషల్లో సినిమాలను డబ్ చేసిన ప్రేక్షకుల మీదికి ఒదలుతున్నారు. ఈ కోవలో రవితేజ, నాగ చైతన్య హీరోలుగా నటించిన ఫ్లాప్ చిత్రాలు ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసాయి. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2024, 10:56 AM IST
Tiger Nageswara Rao - Custody: ఒకేసారి ఆ భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన రవితేజ, నాగ చైతన్య చిత్రాలు..

Tiger Nageswara Rao - Custody:  ఈ మధ్యకాలంలో మన హీరోలు ప్యాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తున్నారు. తీరా రిలీజ్ సమయం వచ్చేసరికి కేవలం ఆయా భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక రవితేజ కెరీర్‌లోనే తొలి ప్యాన్ ఇండియా మూవీ అంటూ హడావుడి చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను కేవలం తెలుగుకే పరిమితమైంది. ఆ తర్వాత ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఇక నాగ చైతన్య హీరోగా నటించిన 'కస్టడీ' చిత్రాన్ని ముందుగా తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో హిందీ మినహా మిగిలిన భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 

బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపును మూటగట్టుకున్న ఈ రెండు చిత్రాల హిందీ వెర్షన్ లేటెస్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను ఇపుడు హిందీలో వీక్షించవచ్చు. ప్రస్తుతం నాగ చైతన్య.. చందూ మొండెటీ దర్శకత్వంలో 'తండేల్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ నేపథ్యంలో 1970 బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. మరోవైపు రవితేజ.. రీసెంట్‌గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' సినిమా చేస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News