Mandakini Streaming In AHA: ఎప్పటికప్పుడు నూతన కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా. సినిమాలు, కామెడీ షో, డ్యాన్స్ షోలతోపాటు ఇప్పుడు ఆహాలో డైలీ సీరియల్స్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న మిస్టర్ పెళ్ళాం సీరియల్ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన 'మందాకిని' సీరియల్ స్ట్రీమింగ్ అవుతోంది. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సీరియల్‌లోని మొదటి నాలుగు ఎపిసోడ్స్ ఈ నెల 6వ తేదీ నుంచి అందుబాటులో ఉన్నాయి. కార్తీకదీపం ఫేమ్, ప్రముఖ సీరియల్ నటుడు నిరుపమ్ పరిటాల, వాసుదేవరావు వంటి వారు మందాకిని సీరియల్ యూనిట్‌ను మెచ్చుకుంటూ అభినందనలు తెలిపారు.
ఆర్‌కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మందాకిని సీరియల్‌లో ఆర్‌కే చందన్, హిమబిందు, మిధున్, జయలలిత, సాయికిరణ్, వర్ష, ప్రియా హెగ్డే, నాగిరెడ్డి తదితర నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. వరుణ్ చౌదరి గోగినేని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. శ్రీనివాస్ మండల కథను అందించారు. ఆసం శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. ఆహాలో సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మందానికి సీరియల్ స్ట్రీమింగ్ కానుంది.
కథ ఏంటి..?
ఆర్య (ఆర్‌కే చందన్) ఓ యాడ్ ఫిల్మ్ మేకర్‌గా పనిచేస్తుంటాడు. ఆర్యకు కలలో మందాకిని (హిమబిందు) వస్తుంటుంది. ఎంతో కష్టపడి ఓ రోజు ఆమెను అతను కలుసుకుంటాడు. అయితే ఆమె అప్పటికే ఓ శాపానికి గురైందన్న విషయం తెలుసుకుని ఆర్య షాక్ అవుతాడు. తెలంగాణలో ఉన్న ఓ మారుమూల గ్రామంలోని పురాతన ఆలయంలో ఆమెతో కలిసి పూజలు చేస్తే శాప విముక్తి కలుగుతుందని తెలుసుకుంటాడు. పూజలు చేసేందుకు అక్కిడికి వెళ్లగా.. కళింగ వర్మ (మిథున్) అనే ఓ వ్యక్తి పూజలు నిర్వహించకుండా అడ్డుపడుతుంటాడు.
ఈ అడ్డంకులు అధిగమించే క్రమంలో ఆర్యకు ఈ శాపానికి కారణం తెలుస్తుంది. అదేవిధంగా వేదవతి (జయలలిత) కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా తెలుస్తాయి. ఆ వివరాలు ఏంటి..? మందారికిని శాపం నుంచి ఎలా విముక్తి పొందింది..? ఎందుకు కళింగ వర్మ అడ్డంకులు సృష్టిస్తున్నాడు..? అనేదే మిగిలిన కథ. మొదటి 8 ఎపిసోడ్లను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది ఆహా. మిగిలిన ఎపిసోడ్స్ చూడాలంటే ఆహా సబ్‌స్క్రిప్షన్ ఉండాలి.
Also Read: Umesh Yadav: ఉమేష్ యాదవ్ ఇంట పండుగ వాతావరణం.. విషాద సమయంలో గుడ్‌న్యూస్
Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook