/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

The Kerala Stroy OTT News: గత కొన్నేళ్లుగా ఏదైని సినిమా విడుదలైన తర్వాత మూడు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కానీ హిందీ సినిమాలు మాత్రం 7 వారాల తర్వాత రిలీజ్ చేయాలనే నిబంధన ఉంది. కానీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నటించిన 'ది కేరళ స్టోరీ' మూవీ మాత్రం విడుదలైన 8 నెలలకు ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ఈ సినిమా అక్కడ నెంబర్ వన్‌ ట్రెండింగ్‌లో కొనసాగడం విశేషం.

కేరళ రాష్ట్రంలో జరిగిన లవ్ జిహాద్ కారణంగా బలైన హిందూ, క్రిష్టియన్ అమ్మాయిలు ఎలా ముస్లిమ్స్ అబ్బాయిలో లవ్ ట్రాప్‌లో ఎలా పడతారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఆ తర్వాత ఐసిస్ క్యాంపులో అమ్మాయిలు చేరడం. ఆ తర్వాత సెక్సు బానిసలుగా మారిన కేరళ అమ్మాయిల నిజ జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు సుదీప్తో సేన్ ఎంతో రీసెర్చి చేసి తెరకెక్కించారు. ఈ సినిమాను విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.

'ది కేరళ స్టోరీ' మూవీ మన దేశంలో  ఓ వర్గం వారికి కించపరిచేలా ఉందని అప్పట్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగాల్ వంటి ప్రభుత్వాలు ఈ సినిమాను అక్కడ రిలీజ్ కాకుండా అడ్డుకున్నాయి. తీరా సుప్రీంకోర్టు జోక్యంతో ఆయా రాష్ట్రాల్లో ఈ సినిమాలు  విడుదలయ్యాయి. మంచి విజయాన్ని సాధించాయి. 'ది కేరళ స్టోరీ' సినిమాను లవ్ జిహాద్ పేరిట 32 వేలకు పైగా అమాయకులైన హిందూ, క్రిష్టియన్ అమ్మాయిలను ఇస్లామ్ మతంలోకి మార్చి వారిని ఐసిస్ క్యాంపుల్లో పంపించి వారిని దేశ వ్యతిరేకులుగా ఎలా మారుస్తున్నారనే విషయాన్ని కేరళ స్టోరీ మూవీలో చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు.

కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేమి కాదు. మన దగ్గర ఎంతో మంది  మతాంతర వివాహాలు చేసుకున్న వారు సంతోషంగా ఉన్నారు. కానీ లవ్ జిహాద్ పేరిట ప్రేమించిన అమ్మాయిలను ఐసీస్ క్యాంపుల్లో చేర్పించి వారిని అక్కడ సెక్స్ బానిసలుగా మార్చడం.. వారు అప్పటి వరకు ఆరాధించిన మతాన్ని ద్వేషించేలా చేయడాన్నే చాలా మంది తప్పు పడుతున్నారు.

ఈ సినిమా ఆర్ఆర్ఆర్, దంగల్ మూవీల తర్వాత ఎక్కువ దేశాల్లో రిలీజైన మూవీగా 'ది కేరళ స్టోరీ' మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రంలో అదా శర్మ.. శాలిని ఉన్నికృష్ణన్ నుంచి ఫాతిమాగా ఎలా మారిందనే విషయాన్ని చూపించారు దర్శకుడు. ఈ సినిమాలోని నటనకు అదా శర్మకు జాతీయ ఉత్తమనటి అవార్డు పక్కా అని చెబుతున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 330 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మొత్తంగా గతేడాది సంచలనం రేపిన ఈ సినిమా ఓటీటీలో అపుడే నంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Section: 
English Title: 
tha kerala story ott streaming on zee 5 today onwords now number one trending ta
News Source: 
Home Title: 

The Kerala Story: ప్ర‌ముఖ ఓటీటీలోకి  ది కేర‌ళ స్టోరీ స్ట్రీమింగ్.. టాప్ ట్రెండింగ్‌లో మూవీ..?

The Kerala Story: ప్ర‌ముఖ ఓటీటీలోకి  ది కేర‌ళ స్టోరీ స్ట్రీమింగ్.. టాప్ ట్రెండింగ్‌లో మూవీ..?
Caption: 
The Kerala Story OTT News (X/Source)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్ర‌ముఖ ఓటీటీలోకి ది కేర‌ళ స్టోరీ స్ట్రీమింగ్.. టాప్ ట్రెండింగ్‌లో మూవీ..?
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Friday, February 16, 2024 - 12:56
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
30
Is Breaking News: 
No
Word Count: 
344