Telugu OTT: ఓటిటిలో ఈ వారం.. రానా నాయుడు టు క్రిస్టోఫర్.. వీకెండ్ షోస్

Telugu Movies And Web Serires This Week: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ నుంచి మళయాళం మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రిస్టోఫర్ వరకు.. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వీకెండ్ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీగా ఉన్న మూవీస్ లిస్ట్ ఇలా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2023, 10:07 PM IST
Telugu OTT: ఓటిటిలో ఈ వారం.. రానా నాయుడు టు క్రిస్టోఫర్.. వీకెండ్ షోస్

Telugu Movies And Web Serires Releasing This Week: రానా నాయుడు: అమెరికన్ క్రైమ్ డ్రామా రే డోనోవన్ తెలుగు రీమేక్ రానా నాయుడు వెబ్ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో లాంచ్ కానుంది. రానా దగ్గుబాటి టైటిల్ రోల్‌ పోషించగా.. రానాకు ఆన్ స్క్రీన్ ఫాదర్ పాత్రలో వెంకటేష్ దగ్గుబాటి కనిపించనున్నాడు.

MH370: ది ప్లేన్ దట్ డిజప్పీయర్డ్ అనే డాక్యుమెంటరీ 2014లో 239 మంది ప్రయాణికులతో మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH370 అదృశ్యమైన ఉదంతం ఆధారంగా తెరకెక్కింది. మూడు ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్ సిరీస్ మార్చి 8 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ కానుంది.

హ్యాపీ ఫ్యామిలీ: కండిషన్స్ అప్లై: రత్న పాఠక్ షా, రాజ్ బబ్బర్, అతుల్ కులకర్ణి, అయేషా జుల్కా ధోలాకియాస్‌గా నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా " హ్యాపీ ఫ్యామిలీ: కండిషన్స్ అప్లై " మార్చి 10 నుండి అమేజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

క్రిస్టోఫర్: మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క్రిస్టోఫర్ మార్చి 9 నుంచే అమేజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. మలయాళంలో తెరకెక్కిన క్రిష్టోఫర్.. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో అందుబాటులో ఉంది.

దళపతి విజయ్ హీరోగా వచ్చిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వారిసు మూవీ ( తెలుగులో వారసుడు ) ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో ఓటిటిలో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుండగా.. తాజాగా హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా యాడ్ అయింది. మార్చి 8 నుండే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రసారం అవుతోంది. హిందీలో ఈ సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సినిమా ఈ వీకెండ్ గుడ్ ఎంటర్‌టైనర్.

Trending News