Vaishnavi Chaitanya: 'బేబీ' బ్యూటీకి వెల్లువెత్తుతున్న ఆఫర్స్.. రామ్ సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి ?

Vaishnavi Chaitanya: 'బేబీ' సినిమా హిట్ తో  వైష్ణవి చైతన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ రామ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2023, 04:40 PM IST
Vaishnavi Chaitanya: 'బేబీ' బ్యూటీకి వెల్లువెత్తుతున్న ఆఫర్స్.. రామ్ సరసన లక్కీ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి ?

Vaishnavi Chaitanya: 'బేబీ' సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకుంది తెలుగమ్మాయి  వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). మెుదటి సినిమాతోనే తన యాక్టింగ్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. బేబీలో ఆమె నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ లేరు. అంతలా జీవించింది ఆ క్యారెక్టర్ లో ఈ బ్యూటీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ చేసిన బేబీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి అయితే వైష్ణవిని సహజనటి జయసుధతో పోల్చారంటే.. ఆమె యాక్టింగ్ ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిలిం సర్కిల్ లో ఎక్కడా చూసిన వైష్ణవి పేరు వినిపిస్తోంది. 

బేబీ హిట్ తో వైష్ణవికి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయంట. యంగ్ హీరోస్ ప్రాజెక్ట్స్ కోసం ముందుగా వైష్ణవి పేరునే ఆప్షన్ గా తీసుకుంటున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart Movie) మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టారు మేకర్స్. ఇక ఈ సినిమాలో రామ్ జోడిగా వైష్ణవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ మూవీలో మరో ఇద్దరు కథానాయికలకు కూడా ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఒక హీరోయిన్ గా అయితే వైష్ణవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  

Also Read: OMG 2 Trailer: ఆసక్తి రేకెత్తిస్తున్న అక్షయ్‌ కుమార్ 'ఓ మై గాడ్-2' ట్రైల‌ర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News