Taraka Ratna Wife : ఎదుటి వాళ్లకేమీ తెలియదు!.. భగవద్గీతను తలుచుకుంటున్న తారకరత్న భార్య

Taraka Ratna Wife తారకరత్న భార్య ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. ఇన్ని రోజులు తారకరత్న భార్య పేరు కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు. తారకరత్న మరణానంతరం అలేఖ్య రెడ్డి ఎక్కువగా పాపులర్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2023, 02:21 PM IST
  • నెట్టింట్లో అలేఖ్యా రెడ్డి పోస్టులు
  • తారకరత్నను తలుచుకుంటూ ఎమోషనల్
  • భగవద్గీత సారాన్ని చెప్పిన అలేఖ్య రెడ్డి
Taraka Ratna Wife : ఎదుటి వాళ్లకేమీ తెలియదు!.. భగవద్గీతను తలుచుకుంటున్న తారకరత్న భార్య

Taraka Ratna Wife తారకరత్న మరణించిన సమయంలో అతని ముగ్గురు పిల్లలు, భార్య అలేఖ్య రెడ్డికి సంబంధించిన ఫోటోలు, విజువల్స్, వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తారకరత్న, అలేఖ్య రెడ్డిల ప్రేమ వివాహాం, ఇంట్లో వాళ్ల నుంచి ఎదురైన ఇబ్బందులు, ఒంటరి సంసారం గురించి లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. తారకరత్నను ఆయన తల్లిదండ్రులు దూరంగా పెట్టిన సంగతి తెలిసిందే. చివరకు చావులోనూ తల్లిదండ్రులు కాస్త కఠినంగానే వ్యవహారించారని అంటుంటారు.

ఇప్పుడు కూడా కోడలు, మనవడు, మనవరాళ్లను చేరదీయడం లేదని తెలుస్తోంది. వారి బాధ్యతను బాలయ్య చూసుకుంటాడని హామీ ఇచ్చినట్టు విజయసాయి రెడ్డి కూడా చెప్పేశాడు. అయితే తమ కుటుంబాన్ని ఎప్పుడూ బాలయ్యే కాపాడుతూ వచ్చాడని, ఆయన మాత్రమే తారకరత్న గురించి గానీ, తమ గురించి గానీ ఆలోచించారని మొన్నా మధ్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసింది. బాలయ్య, తారకరత్న, పిల్లలు ఉన్న ఫోటోను ఓ ఫ్యాన్ ఎడిట్ చేయగా.. ఆ ఫోటో అలేఖ్య రెడ్డి కంట్లో పడింది. ఈ ఫోటోను ఎవరూ చేశారో గానీ థాంక్స్ అని చెబుతూ బాలయ్య తన కుటుంబానికి ఎలా అండగా నిలబడ్డాడో అలేఖ్య రెడ్డి వివరించింది.

అయితే ఇప్పుడు అలేఖ్య రెడ్డి భగవద్గీతలోని ఓ వ్యాఖ్యాన్ని చెప్పింది. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో ఆ కొటేషన్‌ను షేర్ చేసింది. ఏ ఒక్కరికీ మన మీద ఒకే రకమైన అభిప్రాయం ఉండదు.. నీ జీవితం ఎలా ఉంది.. ఏం జరిగింది? అనే విషయం నీకు మాత్రమే తెలుస్తుంది.. ఎదుటి వాళ్లకు నీ గురించి ఏం తెలియదు.. వారి కోసం ఆలోచిస్తూ నువ్ నిద్రలేని రాత్రులు గడపొద్దు అంటూ గీతాసారాన్ని ఇలా చెప్పేసింది.

లోకేష్ యువగళం పాదయాత్ర నాడు కుప్పంలో తారకరత్న కుప్పకూలడం, ఆ తరువాత కుప్పం హాస్పిటల్‌లో కొద్దిసేపు చికిత్స అందించడం, కండీషన్ సీరియస్ అని తెలియడంతో వెంటనే  బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్లో చేర్పించడం, దాదాపు 23 రోజుల చికిత్స అనంతరం తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
 

Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే

Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News