Shyam Singha Roy Tara Song: 'శ్యామ్ సింగరాయ్' చిత్రం నుంచి 'తారా' సాంగ్ వచ్చేసింది!

Shyam Singha Roy Tara Song: నేచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24 (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని తారా లిరికల్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 11:06 AM IST
Shyam Singha Roy Tara Song: 'శ్యామ్ సింగరాయ్' చిత్రం నుంచి 'తారా' సాంగ్ వచ్చేసింది!

Shyam Singha Roy Tara Song: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్​ సింగరాయ్' శుక్రవారం (డిసెంబరు 24) గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమాలోని మరో సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. చిత్రంలోని తారా లిరికల్ సాంగ్ ను గురువారం ఉదయం విడుదల చేసింది. 

పీరియాడికల్, మోడ్రన్​.. రెండు కలిసేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్లు చూస్తుంటే తెలుస్తోంది. కోల్​కతా నేపథ్యంగా ఎక్కువభాగం ఉండనుంది. ఇందులో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

అయితే నాని గత రెండు సినిమాలు 'వి', 'టక్ జగదీష్' సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్లలో వస్తుండటం వల్ల ఫ్యాన్స్​ ఆనందంగా ఉన్నారు. ఓటీటీలో రిలీజైన ఆ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచినా.. 'శ్యామ్ సింగరాయ్' సూపర్ హిట్ అవుతుందని చిత్రబృందం ధీమాగా ఉంది.   

Also Read: RRR Movie 4th Single: RRR నుంచి మరో సాంగ్ అప్డేట్.. 'రోర్ ఆఫ్ భీమ్' రిలీజ్ ఎప్పుడంటే?

Also Read: Indian Movie in Oscar: ఆస్కార్ రేసులో ఇండియన్ డాక్యుమెంటరీ.. పోటీ నుంచి తప్పుకున్న తమిళ చిత్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News