Tamannaah: ఇంత త్వరగా ఇంటికి వస్తాననుకోలేదు..

హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం.. కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్న తమన్నా.. తాజాగా ముంబైలోని తన ఇంటికి చేరుకుంది.

Last Updated : Oct 15, 2020, 06:55 AM IST
Tamannaah: ఇంత త్వరగా ఇంటికి వస్తాననుకోలేదు..

Actress Tamannaah get back home: హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం.. కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్న తమన్నా.. తాజాగా ముంబైలోని తన ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా మిల్కీ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ క్రమంలో తమన్నా తల్లిదండ్రులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ వీడియోలో తమన్నా మాట్లాడుతూ.. ఇంత త్వరగా ఇంటికి చేరుతానని అనుకోలేదని వెల్లడించింది. ఏదీఏమైనప్పటికీ త్వరగానే కరోనా (Coronavirus) మహమ్మారి నుంచి కోలుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ స‌భ్యుల ప్రార్థ‌న‌ల‌తోనే త్వ‌ర‌గా ఇంటికి చేరానని.. ఇప్పుడు కాస్త బ‌లం పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటూ చెప్పుకొచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. దీంతోపాటు తమన్నా తన పెట్ డాగ్‌తో సరదగా ఆటలాడుతూ వీడియోలో కనిపించింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

కరోనా బారిన పడిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయినట్లు అక్టోబరు 5న వెల్లడించింది. షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వచ్చిందని మిల్కీ బ్యూటీ తమన్నా అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. ప్రస్తుతం తమన్నా గోపీచంద్‌తో కలిసి 'సీటీమార్‌' చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి, హిందీ సినిమా ప్రాజెక్టులో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. Also read: Tamannaah: హాస్పిటల్ నుంచి తమన్నా డిశ్చార్జ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News