Suriya: కష్టాల్లోపడిన సూర్య, విక్రమ్.. తమిళ హీరోల పాన్ఇండియా ప్రాజెక్టులకు తప్పని తిప్పలు

Vikram: పేరుకు తమిళ హీరోలు అయినప్పటికీ చాలామంది కోలీవుడ్ హీరోలు..తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రజనీకాంత్ ,కమల్ హాసన్.. లాగా సూర్య, విక్రమ్ కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ కలిగిన నటులు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు భారీ మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు సమస్యలు ఎదురవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2024, 05:40 PM IST
Suriya: కష్టాల్లోపడిన సూర్య, విక్రమ్.. తమిళ హీరోల పాన్ఇండియా ప్రాజెక్టులకు తప్పని తిప్పలు

Kollywood Pan-India Projects: తమ డబ్బింగ్ చిత్రాల ద్వారా ఎందరో తమిళ్ హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వారిలో కొందరు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగారు. అలాంటి హీరోలలో సూర్య, విక్రమ్ ప్రథమ స్థానంలో ఉంటారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ కలిగిన ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నారు. అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో విడుదలకు సిద్ధం కావడం ప్రస్తుతం సరికొత్త సమస్యగా మారబోతోంది.

సూర్య..సిరుతై శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ బడ్జెట్ ప్లాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ మూవీ ఏప్రిల్ కి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మూవీకి సంబంధించిన బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం తో పాటు విఎఫెక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం జరగడంతో ఈ మూవీని దసరా లేదా దీపావళికి విడుదల చేసే విధంగా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు బట్టి.. ఆ సమయానికి కూడా సినిమా విడుదలవడం సందేహం అని తెలుస్తుంది.

మరోపక్క పా.రంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ నటిస్తున్న తంగలాన్ మూవీ కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఎదురుకుంటోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో అంతకంటే విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అడవి మనుషుల జీవిత నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీ టీజర్ ఓ డిఫరెంట్ ఫీలింగ్ ని కలిగించడంతోపాటు చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో విక్రమ్ గెటప్ చూసిన వాళ్లకు ఈ మూవీ లో అతను ఖచ్చితంగా ప్రాణాల మీదకు తెచ్చుకునేటంత రేంజ్ స్టంట్లను చేశాడు అన్న విషయం అర్థమైపోతుంది.

నిజానికి ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మూవీ వాయిదా పడింది. పోనీ ఏప్రిల్ కైనా విడుదలవుతుందా అంటే అదే సమయానికి తమిళనాడులో ఎన్నికలు ఉంటాయి కాబట్టి.. ఏ మూవీ ని ఆ టైంలో విడుదల చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో తంగలాన్ రిలీజ్ డేట్ కూడా డైలమాలో పడింది. 

మరోపక్క కంగువా, తంగలాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ కాకూడదు అని కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటుగా ఈ రెండు సినిమాలకు తెలుగు పాన్ ఇండియన్ మూవీస్ విడుదల కూడా సమస్యగా మారే అవకాశం ఉంది. 

పవన్ కళ్యాణ్ ఓజి, ఎన్టీఆర్ దేవర పార్ట్ 1,పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ సినిమాలలో ఏదో ఒకటి కచ్చితంగా ఈ రెండు చిత్రాలతో తలపడే అవకాశం ఉంది. అదే జరిగితే మూవీ కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2025 జనవరి పండగ సీజన్ ఈ మూవీస్ విడుదలకు బ్రహ్మాండంగా ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు .కానీ మొన్న సంక్రాంతి పోటీకి తమిళ్ డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్ లో ఎంట్రీ కష్టమైపోయింది. కాబట్టి ఎన్నో క్యాలిక్యులేషన్స్ వేసుకొని.. విడుదల తారీకులను ఫిక్స్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈ రెండు సినిమాలు ఉన్నాయి.

Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే

Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News