Rajanikanth met Chandrababu: నిన్న పవన్..నేడు రజనీ.. బాబుతో వరుస భేటీలు!

Rajanikanth met Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వరుస భేటీలతో వార్తల్లోకి వస్తున్నారు, నిన్న పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన ఈరోజు రజనీకాంత్ తో భేటీ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 9, 2023, 10:47 PM IST
Rajanikanth met Chandrababu: నిన్న పవన్..నేడు రజనీ.. బాబుతో వరుస భేటీలు!

Superstar Rajanikanth met Chandrababu at His House: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వరుస భేటీలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. నిన్నటికి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లి రెండు గంటల పాటు భేటీ అయితే ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ హీరో రజినీకాంత్ చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో రాజకీయ ప్రాధాన్యత లేదు అని చెబుతున్నా రజనీకాంత్ పొలిటికల్ బ్యాగ్రౌండ్ బట్టి చూస్తే ఇప్పుడు అనేక చర్చలు జరుగుతున్నాయి.

రజినీకాంత్ సొంతంగా తమిళనాడులో ఒక పార్టీ పెట్టి తర్వాత తన అనారోగ్యం రీత్యా తాను పార్టీని నడపలేనని చెప్పి రద్దు చేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా బిజెపికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. మరోపక్క 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమితో కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు 2019లో మాత్రం వారికి దూరమై ఒంటరిగా పోటీ చేసి దారుణ వైఫల్యాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ జనసేనతో మరోసారి జట్టు కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో బిజెపికి సపోర్ట్ గా ఉన్న రజనీకాంత్ స్వయంగా వచ్చి చంద్రబాబుతో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే చంద్రబాబు సన్నిహితులు సహా టీడీపీ వర్గాల నుంచి చెబుతున్న వారు మాత్రం ఇది సాధారణ భేటీ అని హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కోసం వచ్చిన రజనీకాంత్ మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసారు తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా జైలర్ అనే సినిమా రూపొందుతోంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కళానిధి సన్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజకుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తూ ఉండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

Also Read: Kapunadu Strong Warning: వర్మా, చెప్పు తీసుకుని కొడతాం.. కాపునాడు నేతలు ఘాటు వ్యాఖ్యలు!

Also Read: Shruthi Hassan: 'వాల్తేరు వీరయ్య'కి జ్వరమంటూ హ్యాండిచ్చి బాలయ్య షోకి శ్రుతి హాసన్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News