Pushpa 3: పుష్ప సీక్వెల్ కాదు ఫ్రాంచైజ్.. బంగారు బాతును పట్టేసిన మైత్రీ మూవీ మేకర్స్?

Sukumar Planning Pushpa 3: సుకుమార్ పుష్ప సినిమాను సెకండ్ పార్ట్ తో ఆపాలని అనుకోవడం లేదని దీనికి మూడవ భాగం కూడా తెరకేకించే ఆలోచనలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 8, 2022, 10:40 PM IST
 Pushpa 3: పుష్ప సీక్వెల్ కాదు ఫ్రాంచైజ్.. బంగారు బాతును పట్టేసిన మైత్రీ మూవీ మేకర్స్?

Sukumar Planning Pushpa 3 After Pushpa 2:సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా రుపొందిన పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ వంటి వారి కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలయి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మీద భారీ కలెక్షన్స్ కూడా వచ్చాయి. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా పెద్ద ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కాల్సిన రెండో భాగం మీద దృష్టి పెట్టిన సుకుమార్ ఎలా అయినా సినిమాని ఒక రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే సుకుమార్ మనసులో పుష్ప 3  ఆలోచన కూడా ఉందని అంటున్నారు.

ఇప్పటికే పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్గా నిలిచింది కాబట్టి పుష్ప సెకండ్ పార్ట్ తీస్తున్నారు సెకండ్ పార్ట్ కూడా ఊహించిన మేర అంచనాలను అందుకుని కలెక్షన్లు భారీగా రాబడితే కనుక అప్పుడు మూడో భాగం కూడా తీసే అవకాశం ఉందని దీనిని సీక్వెల్స్ లాగా కాకుండా ఫ్రాంచైజ్ లాగా మార్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఒకరకంగా ఈ సినిమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ఇది ఒక బంగారు గుడ్లు పెట్టే బాతులాగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

నిజానికి పుష్ప మొదటి భాగం అంతా ఎర్రచందనం కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటుంది. పుష్పరాజ్ అనే ఒక సాదాసీదా కూలీ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నడిపే వ్యక్తిగా ఎలా ఎదిగాడనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఆ వ్యక్తి ఎదిగి ఎర్రచందనం సిండికేట్ ఓనర్ గా మారిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని రెండో భాగంలో చూపించబోతున్నారు. ఇక మూడవ భాగంలో ఎలాంటి విశేషాలు చూపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Kodali Nani and Jr NTR: మంచి స్నేహితులే కానీ అప్పటి నుంచి ఏమీ లేదు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసంటున్న డైరెక్టర్!

Also Read: Kushi Blasting Rights: లైగర్ దెబ్బేసినా తగ్గేదేలే అంటూ అమ్ముడైన ఖుషీ రైట్స్.. సమంత కలిసొచ్చిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News