Sriranga Neethulu Movie Review: 'శ్రీరంగనీతులు' మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్టు అందుకున్నట్టేనా.. !

Sriranga Neethulu Movie Review: 'కలర్ ఫోటో' మూవీ నుంచి సుహాస్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నాయి. రీసెంట్‌గా 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ఇపుడు బేబి ఫేమ్ విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నంలతో చేసిన 'శ్రీరంగనీతులు' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ అందుకున్నట్టేనా.. మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2024, 09:30 AM IST
Sriranga Neethulu Movie Review: 'శ్రీరంగనీతులు' మూవీ రివ్యూ.. సుహాస్ మరో హిట్టు అందుకున్నట్టేనా.. !

రివ్యూ:  శ్రీరంగనీతులు(Sriranga Neethulu)
నటీనటులు: సుహాస్, విరాజ్ అశ్విన్, రుహాని శర్మ, కార్తీక్ రత్నం..తదితరులు
సినిమాటోగ్రఫీ: టిజో టోమి
ఎడిటర్: శశాంక్ ఉప్పుటూరి
సంగీతం: అజయ్ అరసాడా
నిర్మాత: వేంకటేశ్వరరావు బల్మూరి
దర్శకత్వం: ప్రవీణ్ కుమార్ VSS
విడుదల తేది: 11-4-2024

సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'శ్రీరంగనీతులు'.  ఆంథాలజీ  సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని  ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహించారు.  వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు భారీ ఎత్తున విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

‘శ్రీరంగనీతులు’ సినిమా మూడు డిఫరెంట్ కథలతో ఆంథాలజీ జానర్ లో తెరకెక్కించారు. ఓ కథలో.. శివ(సుహాస్) హైదరాబాద్ లోని ఓ బస్తి పోరడు. సామ్ సంగ్ లో టెక్నిషియన్ గా వర్క్ చేస్తుంటాడు. బస్తీలో కుర్రాళ్ళ మధ్య గొప్పగా ఉండాలని ఆ ఏరియా రాజకీయ నాయకుడితో ఫొటో దిగి బతుకమ్మకు గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ వేయిస్తాడు. తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీ ఉండదు. అది బస్తీలో తన ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు అది చించేశారని తెలుస్తుంది. మరో కథలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమికులు. ఇందుకు తాను ప్రగ్నెంట్ అని అనుమానం వస్తుంది. అదే సమయంలో ఇంట్లో పెళ్లి సంబంధం ఓకే చేస్తారు. ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పడానికి భయపడుతుంది. మరో వైపు కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని మందు, సిగరెట్, గంజాయికి అలవాటు పడతాడు. ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతాడు. అనుకోకుండా కార్తీక్ తమ్ముడు మొక్కలతో ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందులో ఉన్న గంజాయి మొక్కలు పోలీసులకు కనపడి ఇంటికి వెళ్తే కార్తీక్ ఆ గంజాయి మొక్కలతో పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. మరి శివ మళ్ళీ ఫ్లెక్సీ వేయించాడా?శివ తన ఫ్లెక్సీ చింపేసిన ఆపోజిట్ గ్యాంగ్ ని ఏం చేసాడు? ఇందు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందా? తన ప్ప్రెగ్నెన్సీ కంఫర్మ్ అయిందా లేదా? కార్తీక్ పోలీసులకు దొరికాడా? కార్తీక్ మాములు మనిషిగా మళ్ళీ మారాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

కథనం, విశ్లేషణ..

ఆంథాలజీ జానర్ లో ఈ సినిమాలో మూడు కథలు ఉన్నా ఏ కథకి సంబంధం ఉండదు. కానీ తనికెళ్ళ భరణి గుళ్లో జీవిత కథలు చెప్తూ అవి ఇవేనేమో అని భ్రమ కలిగించేలా రాసుకున్నారు కథాంశాన్ని. మూడు కథలను ఒకేసారి చూపిస్తూ ఉంటారు. స్క్రీన్ ప్లే ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా రాసుకున్నారు. సినిమాలో కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. చివర్లో కొంచెం ఎమోషన్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మనిషి ఉన్న దాంట్లో బతక్కుండా గొప్పలకు పోతాడని, లైఫ్ లో ధైర్యం ఉండాలనే కాన్సెప్ట్ ని చక్కగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మూడు కథలకు తగ్గట్టు చాలా చక్కగా చూపించారు. పాటలు ఓకే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరిపోయింది.  ఒక మంచి పాయింట్ తో మూడు కథలను ఎక్కడా కన్ఫ్యూజ్ రాకుండా తెరకెక్కించడంతో దర్శకుడు ప్రవీణ్ కుమార్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

నటీనటుల విషయానికొస్తే...

సుహాస్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బస్తి కుర్రాడి పాత్రలో  జీవించాడు సుహాస్. రుహాణి శర్మ ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే భయపడే సాధారణ అమ్మాయిలా ఒదిగిపోయింది.  లవర్ బాయ్ లా విరాజ్ మరోసారి ఓకే అనిపించాడు. వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తిగా కార్తీక్ రత్నం నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్
 
కథనం

సుహాస్ నటన

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

సెండాఫ్ ల్యాగ్

ఎడిటింగ్

రేటింగ్.. 2.75/5

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News