Sonu Sood receives grand welcome: సోనూసూద్‌కి ఘన స్వాగతం

కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా లాక్ డౌన్ విదించిన సమయంలో యాక్టర్ సోను సూద్ ( Sonu Sood ) తన సహాయ స్వభావంతో వేలాది మంది వలస కార్మికులను వారి ఇళ్లకు చేర్చి మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. తన సహాయాన్ని కోరుకునే వారందరికీ సోనూ సూద్ నిరంతరం సహాయం అందిస్తూ రియల్ లైఫ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

Last Updated : Sep 29, 2020, 03:30 PM IST
Sonu Sood receives grand welcome: సోనూసూద్‌కి ఘన స్వాగతం

కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా లాక్ డౌన్ విదించిన సమయంలో యాక్టర్ సోను సూద్ ( Actor Sonu Sood ) తన సహాయ స్వభావంతో వేలాది మంది వలస కార్మికులను వారి ఇళ్లకు చేర్చి మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. తన సహాయాన్ని కోరుకునే వారందరికీ సోనూ సూద్ నిరంతరం సహాయం అందిస్తూ రియల్ లైఫ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. Also read : Google doodle for Zohra Sehgal: జోహ్రా సెహగల్‌కి గూగుల్ డూడుల్‌తో నివాళి

‘అల్లుడు అదుర్స్’ సినిమా ( Alludu Adurs movie ) తుది షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ( Bellamkonda Sai Srinivas ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో సోనూ సూద్ కూడ నటిస్తున్నారు. కరోనావైరస్ లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల విరామం తర్వాత సోను సూద్ ఈ చిత్ర షూటింగ్ కోసం సెట్స్‌లోకి అడుగుపెడుతుండగా, ఈ చిత్ర బృందం, అలాగే సిబ్బంది అంతా కలిసి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. సాధారణంగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోను సూద్‌కి ఈ సినిమా సెట్‌లో హీరోలా ఘన స్వాగతం లభించింది. అనంతరం సోను సూద్‌కి ప్రకాష్ రాజ్ శాలువతో సత్కరించి, బొకే అందించారు. Also read : Happy Birthday Sneha Reddy: భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నభ నటేష్ ( Actress Nabha Natesh ), అను ఇమాన్యుయల్ ( Actress Anu Immanuel ) నటిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News