Sonu Sood: కలియుగ కర్ణుడు సోనూ సూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ?

Real Hero Sonu Sood : కలియుగ కర్ణుడు అనే పదం అతిశయోక్తి అనిపించినా.. సోనూ సూద్ చేస్తున్న సహాయానికి అది కరెక్టే అని చెప్పవచ్చు. వలస కార్మికులను ( Migrant Labour ) ఇంటికి చేర్చే విషయంలో అయినా.. లేదా చిత్తూరులో రైతు కుటుంబానికి ( Sonu Sood Tractor ) గంటల్లోనే ట్రాక్టర్ అందించే విషయంలో అయినా... సోనూ సూద్ ఎక్కడా డబ్బు విషయంలో ఆలోచించలేదు. 

Last Updated : Jul 27, 2020, 10:10 PM IST
Sonu Sood: కలియుగ కర్ణుడు సోనూ సూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ?

Real Hero Sonu Sood : కలియుగ కర్ణుడు అనే పదం అతిశయోక్తి అనిపించినా.. సోనూ సూద్ చేస్తున్న సహాయానికి అది కరెక్టే అని చెప్పవచ్చు. వలస కార్మికులను ( Migrant Labour ) ఇంటికి చేర్చే విషయంలో అయినా.. లేదా చిత్తూరులో రైతు కుటుంబానికి ( Sonu Sood Tractor ) గంటల్లోనే ట్రాక్టర్ అందించే విషయంలో అయినా... సోనూ సూద్ ( Sonu Sood ) ఎక్కడా డబ్బు విషయంలో ఆలోచించలేదు. సహాయం కావాలి అంటే ముందుంటూ... మనసున్న మహారాజుగా మారాడు ఈ నటుడు. అడిగిన ప్రతీ ఒక్కరికి సాయం చేస్తున్నాడు..ఇలా చేస్తూ పోతే అతని దగ్గర ఉన్నది అయిపోదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే అతని ఆస్తి ఎంత ఉందో తెలుసుకుందాం ఇప్పుడు.

Read This Story Also: #SonuSoodRealHero:అరుంధతి విలన్..రియల్ లైఫ్ హీరో
సోనూ సూద్ 20 ఏళ్లుగా నటిస్తున్నాడు. తెలుగు ( Tollywood) హిందీ  ( Bollywood) తమిళం ( Kollywood) అని తేడాలేవీ లేకుండా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ సినిమాలు చేస్తుంటాడు. మంచి రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడు. పైగా అతనికి హోటల్ బిజినెస్ కూడా ఉంది. అన్నీ కలిపి సుమారు ఒక 130 కోట్లు పై మాటే ఉంటుందని సమాచారం. 

అయితే ఇక్కడ ఎన్ని కోట్లు ఉన్నాయి అని కాదు.. ఎంత పెద్ద మనసు ఉంది అనేదే పాయింట్. ఎందుకంటే సోనూ సూద్ ( Sonu Sood ) కన్నా రెట్టింపు డబ్బు ఉన్న వాళ్లు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా సహయం చేసే మనసు మాత్రం కొందరికే ఉంటుంది. అందుకే సోనూ సూద్ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతకన్నా ఎక్కువ మంచితనం ఉంది అని ...అతను చల్లగా ఉండాలని వేలాది మంది కోరుకుంటున్నారు.

Read This Story AlsoRGV Says: 2024లో లక్ష శాతం నువ్వే సీఎం..జై పవర్ స్టార్

Trending News