Fateh Teaser Review: సైబర్ నేరాలపై సోనూ సూద్ ఎక్కు పెట్టిన అస్త్రం ‘ఫతే’.. ఆకట్టుకుంటున్న టీజర్..

Fateh Teaser Review: సోనూ సూద్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. విలన్ పాత్రలతో ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తూ హీరోగా యాక్ట్ చేసిన మూవీ ‘ఫతే’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 9, 2024, 04:20 PM IST
Fateh Teaser Review: సైబర్ నేరాలపై సోనూ సూద్ ఎక్కు పెట్టిన అస్త్రం ‘ఫతే’.. ఆకట్టుకుంటున్న టీజర్..

Fateh Teaser Review: విభిన్న పాత్రలతో తెలుగు సహా దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యారు సోనూ సూద్. చేసిన సినిమాల కంటే కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తూ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం ‘ఫతే’. దర్శకుడిగా సోనూకు ఇదే ఫస్ట్ మూవీ. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ముఖ్యంగా సైబర్ నేర సామ్రాజ్యంపై పోరాటం నేపథ్యంలో సోనూ సూద్ ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ తాజాగా ఈ సినిమాను టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.80 సెకన్ల నిడివి గల ఫతే టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.  బుల్లెట్ల వర్షంతో గన్ పట్టుకొని నిల్చొని ఉన్న సోనూ సూద్ క్యారెక్టరైజేషన్ ను ఏంటో పరిచయం చేస్తూ టీజర్ స్టార్ట్ అవుతోంది.  ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.  వయలెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది.

అంతేకాదు  విజువల్ గ్రాండియ్,  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్ లో నిలిచాయి.  సోనూ సూద్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే, వయలెన్స్ తో కూడిన అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ తో సోనూ సూద్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతోంది.

దర్శకుడిగా చేస్తున్న ఫస్ట్ మూవీ కోసం  సోనూ సూద్ బలమైన కథను ఎంచుకున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి ఆసక్తికరమైన సైబర్ క్రైమ్ అంశాన్ని కథా వస్తువుగా తీసుకొని ఈ సినిమాను బలమైన కథ, కథనాతో అల్లాడు. సైబర్ క్రైమ్ సిండికేట్ ను ఢీ కొట్టి, ఆ చీకటి సామ్రాజ్యంలోని రహస్యాలను ఛేదించే హీరో క్యారెక్టర్ లో నటించాడు. ఈ క్రమంలో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తిగా సోనూ సూద్ కనిపించనున్నారు. .

దర్శకుడిగా మొదటి సినిమాతోనే సోనూ సూద్ తన టాలెంట్ ఏంటో తెలుస్తోంది. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్  వరకు.. తర్వాత ఏం జరుగుతోందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ, ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసే సినిమాగా సోనూ సూద్ ‘ఫతే’ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేయడం విశేషం.

టీజర్ విడుదల సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ఎన్నో యేళ్లుగా ప్రేక్షకుల నుండి నేను అందుకున్న ప్రేమ మాములుది కాదు. ఇప్పుడు ఫతే టీజర్ తో మరోసారి ప్రేక్షకుల నుండి వెల కట్టలేని ప్రేమను చూస్తున్నాను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. ఇది దర్శకుడిగా నా ఫస్ట్ మూవీ మాత్రమే కాదు.. మనలో చాలా మంది తక్కువగా అంచనా వేసే భయంకరమైన ముప్పు అయినటువంటి సైబర్ ప్రపంచంలోని  అదృశ్య, చీకటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడే యోధుడి కథ. రియల్ కి, వర్చువల్ కి మధ్య జరిగే ఆసక్తికర ఆటను, సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా చేసే యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.  మనలో చాలా మంది చూడని యుద్ధాలను ధైర్యంగా ఎదుర్కొనే హీరోలందరి కోసం ఈ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో సోనూ సూద్‌ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోనాలి సూద్, ఉమేష్ కేఆర్ బన్సాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News