Sonam Kapoor: స్టార్ డైరెక్టర్ సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ భామ.. కారణం తెలిస్తే షాక్

Sonam Kapoor - Mani Ratnam: బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సోనమ్ కపూర్ కి.. 2012లోనే.. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఒక తమిళ్ సినిమాలో.. హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందట. కానీ కేవలం ఒకే ఒక్క చిన్న కారణంతో.. సోనమ్ కపూర్ ఈ సినిమాకి నో చెప్పడం అభిమానులను.. సైతం షాక్ కి గురి చేసింది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 13, 2024, 02:14 PM IST
Sonam Kapoor: స్టార్ డైరెక్టర్ సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ భామ.. కారణం తెలిస్తే షాక్

Sonam Kapoor Latest Movie: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.. ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలో 2007లో.. సావరియా అనే సినిమాతో అడుగుపెట్టిన సోనమ్ కపూర్.. తన సినిమాలతో కంటే ఫ్యాషన్ తోనే ఎక్కువగా ఫేమస్ అయింది. మొదట్లో తన సినిమాలు.. అంతంతమాత్రంగానే ఆడినప్పటికీ.. 2013లో ధనుష్ హీరోగా విడుదలైన రాంఝన సినిమా పెద్ద హిట్ అయింది. 

ఆ తర్వాత 2016లో.. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన.. నీర్జ కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలు ఏమీ విడుదల కాకముందే.. 2011 లోనే సోనమ్ కపూర్ కి ప్రముఖ సౌత్ డైరెక్టర్ మణిరత్నం నుంచి.. ఒక తమిళ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. కానీ తనకి తెలియని భాషలో సినిమా అని నచ్చకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ మణిరత్నం కి సోనమ్ కపూర్ నో చెప్పిందట. 

ఆ సమయంలో చాలామంది సోనమ్ కపూర్ స్నేహితులు, తన తండ్రి అనిల్ కపూర్ కూడా.. ఇది చాలా మంచి అవకాశం అని ఈ ఆఫర్ ఒప్పుకోమని ఆమెకు సూచించారట. కానీ ఆమె మాత్రం అప్పటికే.. మణిరత్నంకి నో చెప్పేసిందని తెలుస్తోంది. కేవలం భాష వేరు అనే ఒకే ఒక కారణంతో.. మణిరత్నం సినిమాకి సోనమ్ కపూర్ నో చెప్పింది. 

ఆ తరువాత ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు.. ఇదే ప్రశ్న ఎదురైతే సోనమ్ కపూర్ ఆ సినిమా గురించి తనకి మాట్లాడాలని లేదు.. అని తప్పించుకుంది. 
ఇంతకీ మణిరత్నం ఆమెకు అవకాశం ఇద్దాము అనుకున్నది 2013లో విడుదలైన కాదల్ సినిమాలో. కాదల్ సినిమా కోసం.. సోనమ్ కపూర్ ని సంప్రదించారు. మణిరత్నం స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా అది. గౌతమ్ కార్తీక్, అర్జున్ సర్జ, అరవింద స్వామి, తులసి నాయర్, లక్ష్మీ మంచు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. 

ఇక సినిమాల పరంగా చూస్తే.. పెళ్లి తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేసిన.. సోనమ్ కపూర్.. బాబు పుట్టిన తర్వాత కేవలం కుటుంబంతోనే తన సమయాన్ని గడుపుతోంది. ఆఖరిసారిగా సోనమ్ కపూర్.. గతేడాది విడుదలైన బ్లైండ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News