Sitara - Namrata : మహేష్ బాబు బాటలో సితార, నమ్రత.. ఫ్యామిలీ ఫ్యామిలీ అదే పనా?

Sitara Brand Ambassador సితార, నమ్రతలు ఇద్దరూ కలిసి ఇప్పుడు ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం ప్రకటనలకే పరిమితం అయ్యేట్టు కనిపిస్తోంది. మహేష్‌ బాబు అసలే ఏ యాడ్‌కు అయినా ఓకే చెప్పేస్తాడంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2023, 08:39 AM IST
  • ప్రకటనల్లో దూకుడుగా మహేష్‌ బాబు
  • మొదలెట్టేసిన నమ్రత, సితార
  • మహేష్‌ బాబు బాటలోనే ఫ్యామిలీ
Sitara - Namrata : మహేష్ బాబు బాటలో సితార, నమ్రత.. ఫ్యామిలీ ఫ్యామిలీ అదే పనా?

Sitara Brand Ambassador తెలుగులో స్టార్ హీరోలు ఇప్పుడు ఎక్కువగా ప్రకటనల మీద ఫోకస్ పెట్టేశారు. ఈ విషయంలో అందరి కంటే మహేష్‌ బాబు మాత్రం ముందుంటాడు. బన్నీ, చరణ్‌, తారక్ ఇలా ఎంత మంది ఉన్నా కూడా మహేష్‌ బాబు మాత్రం ఎడా పెడా యాడ్స్‌లో నటిస్తూనే ఉంటాడు. మహేష్‌ బాబు అయితే ఆ ఆ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్‌ అని తేడా లేకుండా అన్నింటికి యాడ్స్ చేస్తుంటాడు. థమ్స్ అప్, మౌంటెన్ డ్యూ ఇలా అన్ని ఉత్పత్తుల తరుపున యాడ్స్ చేస్తాడు.

ఆ మధ్య అయితే మహేష్‌ బాబు తన ఫ్యామిలీ మొత్తాన్ని ఓ యాడ్ కోసం తీసుకొచ్చాడు. అందులో నమ్రత, సితార, గౌతమ్ కూడా నటించారు. అప్పట్లో మహేష్‌ బాబు మీద బాగానే ట్రోలింగ్ జరిగింది. సినిమాల ద్వారా బాగానే వస్తోందిగా.. ఇవన్నీ అవసరమా? ఫ్యామిలీని కూడా యాడ్స్‌లో నటింపజేయాలా? అని కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు నమ్రత, సితార ఇద్దరూ కలిసి ఓ యాడ్ చేశారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

నమ్రత తెరపైకి రాక చాలా కాలమే అయింది. ఆమె సోషల్ మీడియాలో తప్పా ఇంకెక్కడా కనిపించదు. సితార ఈ మధ్య తన అరంగేట్రం గురించి సిద్దంగా ఉన్నట్టుంది. మొన్నా మధ్య సర్కారు వారి పాట కవర్ సాంగ్‌ కోసం స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇలా యాడ్స్ కోసం తల్లీకూతుళ్లిద్దరూ ముందుకు వచ్చారు.  చాక్లెట్‌ కోసం నమ్రత, సితారలు యాడ్ చేశారు. ఈ యాడ్‌ గురించి చెబుతూ నమ్రత వేసిన పోస్ట్‌ వైరల్ అవుతోంది. మొత్తానికి ఫ్యామిలీ ఫ్యామిలీ యాడ్స్ చేస్తూ ఇలా గడిపేస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ ఫుల్ స్వింగులో ఉంది. మహేష్‌ బాబు తన బాడీని పెంచేస్తోన్న విషయం తెలిసిందే. చూస్తుంటే సిక్స్ ప్యాక్‌తో మహేష్‌ బాబు ఆశ్చర్యపరిచేలా ఉన్నాడు. అయితే ఇది రాజమౌళి సినిమా కోసమా? లేదా? త్రివిక్రమ్ కోసమా? అన్నది క్లారిటీగా తెలియడం లేదు.

Also Read:  Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్

Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్‌ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News