Shruti Haasan Love : మేం దాని కోసమే బతుకుతున్నాం.. అలా చేయడమే మాకిష్టం.. ప్రియుడిపై శ్రుతి హాసన్

Shruti Haasan with Santanu Hazarika శ్రుతి హాసన్ శంతను హజారికాల ప్రేమ, డేటింగ్, లవ్ ఎఫైర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ముంబైలోనే ఈ ఇద్దరూ కలిసి ఉంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 11:54 AM IST
  • నెట్టింట్లో శ్రుతి హాసన్ హల్చల్
  • శంతనుతో కలిసి స్పెషల్ డిన్నర్‌
  • ఫుడ్ లవర్స్‌మంటూ శ్రుతి హాసన్ పోస్ట్
Shruti Haasan Love : మేం దాని కోసమే బతుకుతున్నాం.. అలా చేయడమే మాకిష్టం.. ప్రియుడిపై శ్రుతి హాసన్

Shruti Haasan with Santanu Hazarika శ్రుతి హాసన్ శంతను హజారికాల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. వారి బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికైతే వారు రిలేషన్‌లో ఉన్నారు. ముంబైలో ఓ లగ్జరీ భవనంలో ఈ ఇద్దరూ ఉంటున్నారు. గత మూడు నాలుగేళ్లుగా వీరు డేటింగ్‌లో ఉన్నారు. కరోనా సమయంలోనూ కలిసే ఉన్నారు. శ్రుతి హాసన్, శంతను ఇద్దరూ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఒకరికొకరు అండగా నిల్చున్నారు.

అయితే శంతనుతో పెళ్లి మ్యాటర్ మాత్రం శ్రుతి హాసన్ బయటకు చెప్పడం లేదు. మొన్నామధ్య శ్రుతి హాసన్ శంతను పెళ్లి మీద కోలీవుడ్ రూమర్లు క్రియేట్ చేసింది. వాటిపై శ్రుతి హాసన్ కౌంటర్లు వేసింది. పెళ్లి ఇప్పట్లో చేసుకోమని, ఇంకా చాలా టైం ఉందని, అంత వరకు ఈ రూమర్లను ఆపేయండని సెటైర్లు వేసింది.

ఇక ఇప్పుడు సలార్ సినిమా  షూటింగ్‌ను శ్రుతి హాసన్ పూర్తి చేసుకుని ముంబైకి వెళ్లింది. మళ్లీ ఇలా శంతను ఒళ్లోకి చేరడంతో శ్రుతి హాసన్ ఫుల్ ఖుషీ అయింది. ఇక నిన్న వీకెండ్ స్పెషల్‌గా డిన్నర్‌ కోసం బయటకు వెళ్లినట్టున్నారు. వీరి పార్టిలో నీరజ కోన కనిపిస్తోంది. అయితే శ్రుతి హాసన్ తన అలవాట్లు, ఇష్టాల గురించి చెప్పుకొచ్చింది.

బయటకు వెళ్లి ఫుడ్ తినడం నాకు ఇష్టం.. నేను, శంతను తినడం కోసమే బతుకుతుంటాం.. తినేటప్పుడు ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటాం.. నాలానే భోజన ప్రియుడ్ని నేను ఇష్టపడుతున్నందుకు, నా జీవితంలోకి వచ్చినందుకు నేను ఎంతో లక్కీ అంటూ శంతను గురించి శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

శ్రుతి హాసన్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చేలా ఉంది. ఏడాది ప్రారంభంలోనే రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా హిట్‌గా నిలిచింది. ఇక ఇదే ఏడాదిలో సలార్ అంటూ సందడి చేయబోతోంది.

Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!

Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News