Shanmukh Jaswanth Hospitalised: ఆసుపత్రి పాలయిన షణ్ముఖ్ జస్వంత్ .. ఆందోళనలో ఫాన్స్!

Shanmukh Jaswanth Hospitalised due to illness: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 6, 2022, 03:41 PM IST
Shanmukh Jaswanth Hospitalised: ఆసుపత్రి పాలయిన షణ్ముఖ్ జస్వంత్ .. ఆందోళనలో ఫాన్స్!

Shanmukh Jaswanth Hospitalised due to illness: సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే . అయితే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సిరి హనుమంతుతో షణ్ముఖ్ జస్వంత్ చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడంతో అప్పట్లో ఆయనకు భారీ ఎత్తున నెగెటివిటీ వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే దీప్తి సునయన కూడా అతనికి బ్రేకప్ చెప్పింది.

తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్నిగౌరవిస్తున్నానని సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వడమే కాక తన పనిలో పడ్డాడు. బిగ్ బాస్ లో భారీగా నేటివిటీ మూట కట్టుకోవడమే కాక చాలా ట్రోల్స్ ఎదుర్కొన్న షణ్ముఖ్ ఇప్పుడు తన కెరీర్ ను సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. తాజాగా ఆయన నటిస్తున్న ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే ఒక వెబ్ సిరీస్ ఆహాలో స్త్రీం అవుతోంది. అయితే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఆసుపత్రిలో చేరినట్లుగా మన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం ఆసక్తికరంగా మారింది.

ఆయనకు అసలు ఏమైందో క్లారిటీ లేదు కానీ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఒక ఫోటో షేర్ చేయడంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ నుంచి వారానికి ఒక ఎపిసోడ్ విడుదల చేయాల్సి రావడంతో ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షణ్ముఖ్ జస్వంత్ కు జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో జ్వరం రావడంతో ఇక చేసేదేమీ లేక హాస్పిటల్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా  షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే నెలలో  షణ్ముఖ్ జస్వంత్ తన పుట్టినరోజు చేసుకోబోతున్నాడు. పుట్టినరోజు నెలలోనే ఇలా ఆసుపత్రి పాలు అవ్వాల్సి రావడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే  షణ్ముఖ్ జస్వంత్ సన్నిహితులు మాత్రం ప్రస్తుతానికి ఇబ్బంది లేదని ముందు జాగ్రత్త చర్యతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని మళ్లీ తిరిగి త్వరలోనే షూటింగ్స్ కూడా హాజరవుతాడని చెబుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు. 

Also Read: Sita Ramam on Amazon Prime: సీతా రామం ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

Also Read: Kavitha Invested Money on Liger: లైగర్ నిర్మాణం వెనుక కవిత.. ఆ డబ్బుతోనే నిర్మాణం.. జనగణమన కూడా లైన్లో... ఈడీకి సంచలన ఫిర్యాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News