Jawan Movie: గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్‌ న్యూ లుక్‌.. మీరు ఓ లుక్కేయండి..

Shahrukh Khan: షారూఖ్ ఖాన్-అట్లీ కాంబోలో వస్తున్న సినిమా 'జవాన్'. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త  పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా సెప్టెంబరు 07న విడుదల కానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2023, 04:51 PM IST
Jawan Movie: గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్‌ న్యూ లుక్‌.. మీరు ఓ లుక్కేయండి..

Jawan Movie Update: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'జవాన్'(Jawan Movie). పఠాన్‌ వంటి బ్లాక్ బస్టర్ తరువాత కింగ్‌ఖాన్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు వీరలెవల్లో ఉన్నాయి. ఇందులో షారుఖ్ జోడిగా నయనతార నటించింది. ఇందులో విజయ్‌ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. అతిథి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 07న విడుదల కానుంది. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళంలో రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా రిలీజైన పోస్టర్స్, టీజర్, టైలర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ లో బాద్ షా చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్ లో షారుఖ్ గన్ పట్టుకుని గుండుతో కనిపిస్తున్నాడు. నేను మంచోడినా, చెడ్డోడినా అనేది మరో 30 రోజుల్లో తెలుస్తుంది అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ జోడించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తెలుగులో రికార్డు ధరకు ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో థియటర్లన్నీ దద్దరిల్లిపోనున్నాయి. ఇది షారుఖ్‌కు మరో వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

Also Read: Devara Movie Update: భారీ సొర చేపతో తలపడనున్న ఎన్టీఆర్.. ఛత్రపతిని మించి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News