Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?

Shaakuntalam OTT Streaming Platform: పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిన సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అయితే ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ ఆవుతుందో చూద్దాం పదండి. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 5, 2023, 05:58 PM IST
Shaakuntalam OTT Release: నెల తిరక్కుండానే ఓటీటీలోకి శాకుంతలం.. ఎందులో? ఎప్పుడు రిలీజ్ అంటే?

Samantha’s Shaakuntalam OTT Streaming Date: సమంత హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం శాకుంతలం. తెలుగులో బడా ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో సమర్పిస్తూ రిలీజ్ చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథగా తెరకెక్కిన ఈ అభినవ ప్రేమ కావ్యాన్ని గుణశేఖర్ భారీ బడ్జెట్ తో తన సేవింగ్స్ అన్ని ఖర్చుపెట్టి మరీ నిర్మించారు.

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడం, విజువల్స్ నాసిరకంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద డివైడ్ టాక్ వచ్చింది. ఇక సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రాని నేపథ్యంలో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా దుష్యంతుని పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు.

దుర్వాసుడిగా మోహన్ బాబు, సారంగిగా ప్రకాష్ రాజ్, ఇంద్రుడిగా జిషు సేన్ గుప్తా వంటి వారు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కేవలం తెలుగు భాషలోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించ లేక పోయింది. ఈ సినిమా కోసం దాదాపు 40 నుంచి 60 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరిగింది. గుణశేఖర్ అయితే దాదాపు 80 కోట్ల వరకు ఖర్చయిందని చెబుతున్నారు కానీ ఆ రేంజ్ నిర్మాణం జరగలేదేమో అని ప్రచారం అయితే ఉంది.

Also Read: Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!

ఎందుకంటే నాసిరకం విజువల్స్ చూసిన వారంతా ఆ స్థాయిలో ఈ సినిమా లేదని చెబుతున్నారు. ముందు నుంచి సినిమాని విజువల్ వండర్ గా అభివర్ణిస్తూ వచ్చారు కానీ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆ విషయంలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.  ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ అప్డేట్ కూడా తెరమీదకు వచ్చింది.  అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల ఓటీటీ రిలీజ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ దరకే దక్కించుకుంది. సినిమా భారీ డిజాస్టర్ కావడం, దాదాపుగా అన్ని ప్రాంతాలలో థియేటర్ల నుంచి సినిమాని తప్పించడంతో మే 12 వ తేదీ నుంచి ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ప్రస్తుతానికి అయితే రాలేదు కానీ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ సినిమాని అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం నుంచి డెవలప్ చేసామని చెబుతున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో ఈ సినిమాని ప్రజెంట్ చేయగా సినిమాని స్వయంగా గుణశేఖర్ తన గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద తన కుమార్తె నీలిమ చేత నిర్మింప చేశారు. ఇక ఈ సినిమాని స్వయంగా రిలీజ్ చేసిన దిల్ రాజు తన పాతికేళ్ల కెరియర్లో ఈ సినిమా షాక్ కలిగించిందని ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలన్నీ ఒక్కసారిగా వమ్మయ్యాయని ఒప్పుకున్నాడు. మరి ఈ మధ్యకాలంలో ధియేటర్లలో ఆకట్టుకోని సినిమాలు కొన్ని ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సమంత శాకుంతలం సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోబోతుంది అనేది కాలమే నిర్ణయించాలి.

Also Read: Rama Banam Movie Review: గోపీ చంద్ 'రామబాణం' రివ్యూ-రేటింగ్.. లక్ష్యాన్ని చేధించిందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News