Devara Movie: దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు అత్తగా ఆ సీనియర్ హీరోయిన్

NTR Devara Movie: జూ.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘'దేవ‌ర‌'(Devara). తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2023, 02:49 PM IST
Devara Movie: దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు అత్తగా ఆ సీనియర్ హీరోయిన్

NTR Devara Movie Update: ఆర్ఆర్ఆర్ తర్వాత జూ.ఎన్టీఆర్(JR NTR) నుంచి రాబోతున్న సినిమా ‘'దేవ‌ర‌'(Devara). కొరటాల శివ(Koratala Siva) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా చేస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు అత్తగా విలక్షణ నటి రమ్యకృష్ణ(Ramya Krishnan) నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో నా అల్లుడు సినిమాలో తారక్ కు అత్తగా రమ్యకృష్ణ నటించింది. జాన్వీకపూర్ అమ్మపాత్రలో ఈ సీనియర్ నటి కనిపించబోతుందని సమాచారం. ఎన్టీఆర్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ ఆడియెన్స్ కు ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

Also Read: Telugu Movies In August 2023: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!

ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కుడా పూర్తయ్యాయి. ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి దేవర సినిమాకు పాటలు రాయడం స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఓ అప్ డేట్ ను కూడా ఇచ్చారు మేకర్స్. దర్శకుడే దగ్గరుండి పాటలు రాయించుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ 'దేవర' సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. 

Also read: Guntur kaaram: మహేష్ కోసం రూ.4 కోట్లతో భారీ సెట్.. మూవీ నుంచి మరొకరు ఔట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News