Samantha Responds on Rumors: హీరోయిన్ తో చైతూ డేటింగ్.. ఆ పని చూడమని సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha Ruthprabhu Responds On Rumours : సమంతతో విడాకుల తరువాత నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ వ్యవహారం మీద సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 11:44 AM IST
  • హీరోయిన్ శోబితతో చైతూ డేటింగ్ వార్తలు
  • సమంత టీం పనే అంటూ కధనం
  • షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత
Samantha Responds on Rumors: హీరోయిన్ తో చైతూ డేటింగ్.. ఆ పని చూడమని సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha Ruthprabhu Responds On Rumours : సమంత-నాగచైతన్య జంట గురించి వచ్చినన్ని వార్తలు ఈ మధ్య కాలంలో మరే టాలీవుడ్ జంట గురించి కూడా వచ్చి ఉండవనే చెప్పాలి. అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో సినీ రంగ  ప్రవేశం చేసిన నాగ చైతన్య రెండో సినిమాగా 2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమా చేశాడు. ఈ సినిమాలో తనతో కలిసి నటించిన సమంతతో మంచి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఆమె సిద్ధార్థతో ప్రేమలో పడి బ్రేకప్ అయ్యాక తరువాత చైతన్యతో ప్రేమ చిగురించింది. దీంతో పెద్దలను ఒప్పించి వీరిద్దరూ 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి టాలీవుడ్ లో క్యూట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న ఈ జంట ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉండేది.  

అక్కినేని కుటుంబానికి తగ్గట్టే ఆమె కాస్త అందాల ఆరబోత తగ్గించి సైలెంట్ గానే ఉండేది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో రాజీ అనే ఒక పాత్రలో ఆమె నటించిన తీరు అక్కినేని కుటుంబానికి నచ్చలేదని చైతూ విడాకులు ఇచ్చేస్తున్నాడు అని ప్రచారం జరిగింది. ఆ ప్రచారమే నిజమై గతేడాది అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుని విడిపోతున్నామని  ప్రకటించారు. విడిపోతున్నామన్నారు కానీ ఈ ఇద్దరూ ఏ కారణంతో విడిపోయారనే విషయం ఒక పెద్ద ప్రశ్నర్ధకం. విడాకుల అనంతరం ఎవరికీ వారు తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. చైతన్య ఏమీ సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు కానీ సమంత ఎప్పటికప్పుడు పరోక్షంగా తాను బాధలో ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేసింది. 

ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్‌ హీరోయిన్‌, తెలుగమ్మాయి శోభిత ధూళిపాళతో నాగ చైతన్య డేటింగ్‌ చేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు కలిసి సినిమాలు కూడా చేయని వీరు, అసలు ఎక్కడ కలిశారో తెలియదు కానీ కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అంటూ ప్రచారం మొదలయింది. ఈ వార్తలు జోరుగా ప్రచారం కావడానికి కారణం కూడా ఉంది. సమంతతో కలిసి జయభేరిలో కాపురం ఉన్న నాగచైతన్య విడాకుల తరువాత అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్‌లో ఒక ఇంటిని నిర్మించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం నిర్మాణంలో ఉన్న సదరు ఇంటికి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఒకే కారులో వెళ్లారని టాక్. 

ఇది కాక మేజర్ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో కూడా శోభితను కలవడానికి చైతూ పలుమార్లు వెళ్లాడనే టాక్ రావడంతో వీరు డేటింగ్లో ఉన్నారనే వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక ససోషల్ మీడియా హ్యాండిల్ ఒక వార్త ప్రచురించింది. ఈవార్తలు అన్నీ సమంత పీఆర్ టీమ్ పనే అంటూ చైతన్య ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు అంటూ వార్త ప్రచురించడంతో సమంత స్పందించింది. ఒక అమ్మాయి మీద పుకార్లు వస్తే నిజమంటారని, అదే ఒక అబ్బాయి మీద వస్తే అమ్మాయి చేయించిందని అంటున్నారని పేర్కొంది. గ్రో అప్, ఈ వ్యవహారంలో ఉన్న వారు ఇప్పటికే వారి జీవితంలో ముందుకు  వెళుతున్నారు, మీరు కూడా వెళ్ళండి. మీరు మీ పని మీద, కుటుంబాల మీద ద్రుష్టి పెట్టండి అంటూ పేర్కొంది. 

Also Read: Naga Chaitanya Dating: టాలీవుడ్‌ యువ హీరోయిన్‌తో నాగ చైతన్య డేటింగ్.. ఎవరో తెలిస్తే షాకే?

Also Read: Samantha - Naga Chaitanya: నాగ చైతన్య కోసం.. స్టార్‌ హీరో సినిమా వదులుకున్న సమంత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News