Samantha : ఆసక్తికరంగా సమంత పోస్ట్స్.. చైతూతో కలిసి ఉన్న ఇంట్లోనూ సామ్

Samantha Ruth Prabhu: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ (Sam).. రోజూ ఏదో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘అమ్మ చెప్పింది’ అంటూ తన భావాలను పోస్ట్ చేశారు.

Last Updated : Nov 2, 2021, 02:53 PM IST
  • ఆసక్తికరంగా మారిన సమంత పోస్ట్స్
  • కెరీర్‌‌ పరంగా దూసుకెళ్తున్న సామ్
  • నేను పర్‌ఫెక్ట్‌ కాదు అంటూ పోస్ట్
  • సామ్ ఇంతకుముందు చైతుతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటుందని సమాచారం
Samantha : ఆసక్తికరంగా సమంత పోస్ట్స్.. చైతూతో కలిసి ఉన్న ఇంట్లోనూ సామ్

Samantha Ruth Prabhu calls herself a ‘warrior’ a month after separation from Naga Chaitanya: ‘I am fierce’: నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత లైఫ్‌లో జరిగే ప్రతి విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సామ్ కూడా కెరీర్‌‌ పరంగా దూసుకెళ్తున్నారు. కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. అలాగే మరికొన్ని కథలూ వింటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ (Sam).. రోజూ ఏదో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

Also Read : Huzurabad By Election Result Live Counting:  11 వ రౌండ్లో మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చిన టీఆర్ఎస్

రీసెంట్‌గా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘అమ్మ చెప్పింది’ అంటూ తన భావాలను పోస్ట్ చేశారు. నేను శక్తిమంతురాలిని.. నేను దేనినైనా భరిస్తాను.. నేను పర్‌ఫెక్ట్‌ కాదు.. కానీ నాకు నేను పర్‌ఫెక్ట్‌.. అంటూ సమంత పోస్ట్‌ చేశారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా సమంత (Samantha) తన రెండు కుక్క పిల్లలకు సంబంధించి మార్నింగ్‌ మ్యాడ్‌నెస్‌ (Morning Madness) అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు షేర్‌ చేసింది. 'న్యూ బ్రింగింగ్‌ బ్యాక్‌' (New Bringing Back) అంటూ తన ఇంటికి సంబంధించిన కొన్ని మూమెంట్స్‌ను పోస్ట్ చేసింది. అయితే ఆ పోస్ట్‌ను బట్టి చూస్తే సామ్ (Sam) ఇంతకుముందు చైతుతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటుందని తెలుస్తోంది. ఇక నాగ చైతన్య (Naga Chaitanya) గతేడాదే జూబ్లిహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేశాడు. దాని రెనోవేషన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం చై అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 

Also Read : Diwali Celebrations: దీపావళి సంబరాలు రెండు గంటలే జరుపుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News