Samantha : కష్టమే కానీ నాకు ఇంకో దారి లేదు!.. సమంత ఎమోషనల్

Samantha Ruth Prabhu at Nainital సమంత ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్‌లో బిజీగా ఉందన్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకేతో కలిసి నైనిటాల్‌లో షూటింగ్ చేస్తోంది. అయితే సమంత ఇప్పుడు తన దర్శకులతో పని చేసిన తీరు గురించి చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 02:25 PM IST
  • నైనిటాల్‌లో సమంత సందడి
  • రాజ్ అండ్ డీకే సినిమాతో బిజీ
  • ఇంకో దారి లేదన్న సమంత
Samantha : కష్టమే కానీ నాకు ఇంకో దారి లేదు!.. సమంత ఎమోషనల్

Raj And DK With Samantha సమంత ప్రస్తుతం నైనిటాల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్నాక వెంటనే షూటింగ్‌ల మీద దృష్టి పెట్టేసింది. హెవీ వర్కౌట్లు చేయసాగింది. మొక్కులు తీర్చుకోవాలంటూ గుడి మెట్లు కూడా ఎక్కేసింది. అలా సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది. ఇప్పుడు సమంత తన ప్రాజెక్టుల కోసం విపరీతంగా కష్టపడుతోంది. ఒళ్లు గుల్ల చేసుకుంటోంది. చేతులు రక్తంతో తడిసిపోతోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సమంత నైనిటాల్‌లో షెడ్యూల్ చేస్తోంది. ఈ షెడ్యూల్ గానీ, ఈ షూటింగ్ గానీ అంత సులభంగా ఉంటుందని ఏ ఒక్కరూ చెప్పలేదు.. ముఖ్యంగా రాజ్ అండ్ డీకే అయితే చెప్పలేదు.. అయినా నాకు వేరే దారి లేదు.. అంటూ నైనిటాల్ షెడ్యూల్ గురించి చెప్పుకొచ్చింది. మొత్తానికి చలిలో సమంతను బాగానే కష్టపెడుతున్నట్టుగా కనిపిస్తోంది.

సమంత ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొన దాదాపు ఆరేడు నెలలు అయింది. గత ఏడాది ఆగస్ట్ నుంచి సమంత మయోసైటిస్‌తో బాధపడుతూనే మంచానికే పరిమితమైంది. యశోద సినిమా టైంలో సమంత తన అనారోగ్యం గురించి బయటకు చెప్పింది. యశోద సినిమాకు అతి కష్టం మీద ఒక ఇంటర్వ్యూ చేసింది. ఇక ఆ సమయంలోనే సమంత తాను అనుభవించిన కష్టాల గురించి చెప్పి కన్నీరు పెట్టేసింది.

ఇక శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో సమంత మొదటి సారిగా కనిపించింది. చేతిలో రుద్రాక్ష దండం కనిపించింది. ఎంతో శాంతంగా సమంత కనిపించింది. అయితే సమంత మొహంలో, అందంలో మార్పులు వచ్చాయని ట్రోల్స్ కూడా జరిగాయి. ఆ ఈవెంట్లో దర్శకుడి మాటలకు సమంత కన్నీరు పెట్టేసుకుంది. మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. మునుపటి కంటే ఎంతో బలంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇక వచ్చే వారంలోనే విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ ఖుషి సినిమా షూటింగ్‌లో సమంత జాయిన్ కానుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాతే సమంత కొత్త సినిమాలను ఒప్పుకునేలా కనిపిస్తోంది.

Also Read:  Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్

Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News