Samantha: ఆ ఇద్దరి వల్లనే సమంత ఇంకా బతికుందట, ఎవరా ఇద్దరు

Samantha: టాలీవుడ్ అగ్రనటీనటులు నాగ చైతన్య, సమంతల విడాకుల అంశం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గానే ఉంది. ఈ ఇద్దరి సినిమాలు కూడా చర్చల్లో ఉంటున్నాయి. ఇప్పుడు మరోసారి సమంత వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2022, 08:28 AM IST
Samantha:  ఆ ఇద్దరి వల్లనే సమంత ఇంకా బతికుందట, ఎవరా ఇద్దరు

Samantha: టాలీవుడ్ అగ్రనటీనటులు నాగ చైతన్య, సమంతల విడాకుల అంశం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గానే ఉంది. ఈ ఇద్దరి సినిమాలు కూడా చర్చల్లో ఉంటున్నాయి. ఇప్పుడు మరోసారి సమంత వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

తెలుగు సినీ పరిశ్రమల 3-4 నెలల్నించి ఒకటే అంశం ఇంకా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. అదే నాగ చైతన్య-సమంతల విడాకుల వ్యవహారం. ఇద్దరూ విడాకులు తీసుకుని మూడు నెలలు దాటుతున్నా..ఇంకా సోషల్ మీడియాలో అదే విషయంపై ఏదో మూల ఏదో సందర్భంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా విడాకుల తరువాత సమంత క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో దుమ్ము రేపడంతో సమంత క్రేజ్ అమాంతంగా పెరిగింది. అదే సమయంలో నాగ చైతన్య, సమంతల సోషల్ మీడియా ఎక్కౌంట్లపై నెటిజన్ల ఫోకస్ మరింతగా పెరిగింది. ఇద్దరూ ఏ అప్‌డేట్ షేర్ చేసినా ట్రెండింగ్ అవుతోంది. 

నాగ చైతన్య(Naga Chaitanya)సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నా..సమంత మాత్రం చాలా యాక్టివ్. ఆమె ఏ పోస్ట్ చేసినా..నెటిజన్లు మాత్రం విడాకులకు లింక్ చేస్తుండటంతో వైరల్ అయిపోతోంది. ఇటీవల ఈగోని మీ ఇంట్లో వదిలి వెళ్లండి అనే పోస్ట్ షేర్ చేయడంతో నెటిజన్లు ఎక్కువగా స్పందించారు. అది కూడా నాగ చైతన్య ఇటీవల విడాకుల అంశంపై మాట్లాడిన అనంతరం సామ్ ఈ పోస్టింగ్ చేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి సమంత వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. స్విట్జర్లాండ్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న సమంత (Samantha)..ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఇద్దరు సమంత స్కై ఇన్‌స్ట్రక్టర్లని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరి వల్లనే తానింకా బతికున్నానంటూ ఇన్‌స్టా స్టోరీలో రాయడమే చర్చకు కారణమైంది. #skiingisbelieving ట్యాగ్ తో హల్‌చల్ చేస్తోంది ఈ పోస్ట్. 

Also read: Sudheer Babu Movie: సుధీర్ బాబుతో సినిమా తీసేందుకు కండీషన్​ పెట్టిన కృతి శెట్టి- ఎందుకంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News