Samantha: మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత.. ఈసారి స్పై ఏజెంట్ గా!

Samantha: సమంత బాలీవుడ్ యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 11:54 AM IST
Samantha: మరో క్రేజీ ప్రాజెక్టులో సమంత.. ఈసారి స్పై ఏజెంట్ గా!

Samantha: టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha) బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ధావన్‌ (Varun Dhawan)తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.‘'ఫ్యామిలీ మ్యాన్‌'’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌- డీకే (Raj and DK)లు ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ‘'ఫ్యామిలీ మ్యాన్‌ 2'’(Family Man 2) వెబ్‌ సిరీస్‌లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది సమంత. 

ఈ మధ్య పుష్ప’ సినిమాలో స్పెషల్‌ సాంగ్ (Samantha Special Song in Pushpa) చేసి అదరగొట్టింది సామ్. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాలతో బిజీగా ఉంది.అంతేకాకుండా నయన్ తో కలిసి ‘'కాత్తు వాక్కుల రెండు కాదల్‌'’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. వీటితో పాటు ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది సామ్. 

Also Read: Samantha comment on Sneha: అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి "హాట్‌" అంటోన్న సమంత

బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ధావన్‌ (Varun Dhawan)తో కలిసి సామ్ '‘సిటాడెల్‌'’(Citadel) అనే ఓ సిరీస్‌లో నటించనుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. హాలీవుడ్‌లో ‘అవెంజర్స్‌’ లాంటి సూపర్‌ హీరో చిత్రాలకు రూపొందించిన రుసో బ్రదర్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తుండడం విశేషం. ఇందులో వరుణ్‌, సమంతలు స్పై ఏజెంట్లుగా నటించనున్నారు. వచ్చే ఏడాది ఈ సిరీస్‌ సెట్స్ పైకి వెళ్లనుంది. దానికి ముందే వరుణ్‌, సమంతలు ఓ వర్క్‌షాపులో పాల్గొననున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారు. 

అయితే '‘సిటాడెల్‌'’ పేరుతో అమెరికాలోనూ ఓ యాక్షన్‌ మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటి ప్రియాంక (Priyanka Chopra)ఇందులో కీ రోల్ చేస్తోంది. దీన్ని కూడా రుసో బ్రదర్స్‌ రూపొందిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇండియన్‌ సినిమా ప్రేక్షకుల కోసం కొన్ని మార్పులు చేసి... ఆ యాక్షన్‌ సిరీస్‌ను వరుణ్‌, సమంతతో కలిసి తెరకెక్కిస్తున్నారని సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News