Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలే మనమేంటో తెలియజేస్తాయి: సమంత

Actress Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ఇన్ స్టాలో మరో ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది సమంత.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 04:02 PM IST
Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలే మనమేంటో తెలియజేస్తాయి: సమంత

Actress Samantha: అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)తో విడాకుల అనంతరం అందరి చూపు..సమంత సోషల్ మీడియా అకౌంట్స్ పైనే పడింది. సాధారణంగా సోషల్‌ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉండే సామ్‌..విడాకుల(ChaySam Divorce) తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె షేర్‌ చేస్తున్న పోస్టుల్లో మాత్రం ఏదో తెలియని బాధ, ప్రశ్నించే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. 

Also Read: Happy Birthday Ileana Dcruz: మత్తెక్కిస్తున్న ఇలియానా ఫోటోషూట్, హ్యాపీ బర్త్‌డే ఇలియానా

ఇటీవల అమ్మాయికి పెళ్లి కంటే చదువు ముఖ్యమని తల్లితండ్రులకు సూచిస్తూ పోస్ట్‌ చేసిన సమంత(Actress Samantha) తాజాగా మరో ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసింది. మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే మనమేంటో తెలియజేస్తాయి. తట్టుకోలేని ఒత్తిడికి గురైన సమయంలోనే మనిషి అసలు స్వభావం బయటపడుతుంది అంటూ ప్రముఖ రైటర్‌ రాబ‌ర్ట్ కొటేష‌న్‌ను ఇన్‌స్టా స్టోరీ(Insta Stories)లో అభిమానులతో పంచుకుంది. తాజాగా సమంత చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. 

విడాకుల అనంతరం సామ్ ఎక్కువగా పర్యటనలు చేస్తోంది. కాగా ఇటీవల సామ్‌ చార్‌ధామ్‌ యాత్ర అనంతరం దుబాయ్‌ ట్రిప్‌(Dubai Trip)కు వెళ్లిన సంగతి తెలిసిందే. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌ ట్రిప్స్‌కు వెళ్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News