Pooja Kannan: హీరోయిన్ గా సాయిపల్లవి సిస్టర్..ఫస్ట్ లుక్ విడుదల..

Pooja kannan: ప్రముఖ నటి సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్‌ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుంది. 'జీ5' ఓటీటీలో డిసెంబర్‌ 3న విడుదల కానున్న తమిళ చిత్రం 'చిత్తిరై సేవానమ్‌'(ChithiraiSevvaanam) ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 02:48 PM IST
Pooja Kannan: హీరోయిన్ గా సాయిపల్లవి సిస్టర్..ఫస్ట్ లుక్ విడుదల..

Pooja kannan: ప్రముఖ నటి సాయిపల్లవి(Sai Pallavi) చెల్లెలు పూజా కన్నన్‌(Pooja kannan) హీరోయిన్‌గా సందడి చేయనుంది. తమిళ చిత్రం 'చిత్తిరై సేవానమ్‌' ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం 'జీ5' ఓటీటీ(ZEE5)లో డిసెంబర్‌ 3న విడుదల విడుదలకానుంది. తాజాగా ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో వెల్లడించింది పూజా. 

"ఈ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. డిసెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొంచెం నెర్వస్‌గా ఉంది. సినిమాలో నా పాత్ర పోషించేటప్పుడు వరకూ ఎంత ఎంజాయ్‌ చేశానో...అదే రీతిలో మీరు నా నటనను ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నా. నన్ను ఆశీర్వదించండి" అంటూ ఆ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read: Atrangi Re OTT Release: ఓటీటీ విడుదలకు సిద్ధమైన అక్షయ్, ధనుష్ ‘అత్రాంగి రే’

ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సిల్వ(Silva) దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను అగ్రకథానాయకుడు ధనుష్‌(Dhanush) ట్విటర్‌లో విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ తండ్రీ కూతురి కథ అన్నట్లుగా మోషన్‌ పోస్టర్‌ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో పూజకు తండ్రిగా ప్రముఖ నటుడు సముద్రఖని నటించారు. జీ తమిళ్‌, అమిర్తా, థింగ్‌ బిగ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సామ్‌ సీఎస్‌ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన పూజ.. 2017లో విడుదలైన తమిళ షార్ట్‌ఫిల్మ్‌ 'కారా'లో నటించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News