Sai pallavi: సాయిపల్లవి ఇంట పెళ్లిబాజాలు.. మెుదలైన ఎంగేజ్‌మెంట్‌ సెలబ్రేషన్స్‌.. ఫోటోలు వైరల్..

Sai pallavi: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సాయిపల్లవి ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్‌మెంట్‌ సెలబ్రేషన్స్‌ మెుదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2024, 07:26 PM IST
Sai pallavi: సాయిపల్లవి ఇంట పెళ్లిబాజాలు..  మెుదలైన ఎంగేజ్‌మెంట్‌ సెలబ్రేషన్స్‌.. ఫోటోలు వైరల్..

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి(Sai Pallavi) ఇంట్లో పెళ్లి సంబరాలు మెుదలయ్యాయి. ఆమె సోదరి, నటి పూజ కన్నన్(pooja kannan) త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. తన ప్రియుడు వినీత్‌ను ఆమె పెళ్లాడనుంది. కొనాళ్లుగా ప్రేమించుకుంటున్న పూజా, వినీత్.. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను పూజా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. తన అక్క సాయిపల్లవితో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

సాయిపల్లవి చెల్లెలుగా పూజ సౌత్ ఆడియెన్స్ కు సుపరిచితురాలే. 2021లో వచ్చిన చితిరై సెవ్వానం అనే తమిళ చిత్రంతో నటిగా తెరగ్రేటం చేసింది పూజా. ఇందులో పూజా నటనకు ప్రశంసలు దక్కాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న పూజా కన్నన్.. రీసెంట్ గా పొంగల్ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌ వినీత్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పరిచయం చేసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారని.. త్వరలోనే తమ వివాహం జరగబోతుందని ఆ పోస్ట్ లో ఆమె హింట్ ఇచ్చింది. అంతేకాకుండా ''‘వినీత్‌.. నా సన్‌షైన్‌.  ఇప్పటివరకూ నా పార్ట్‌నర్‌ ఇన్‌ క్రైమ్.. ఇకపై నా జీవిత భాగస్వామి'' అంటూ రాసుకొచ్చింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Kannan (@poojakannan_97)

Also Read: HanuMan Free Tickets: ఒక టికెట్ కి ఇంకో టికెట్ ఫ్రీ.. హనుమాన్ బంపర్ ఆఫర్..

Also Read: Anupama Parameswaran: లెహంగాలో అనుపమను చూస్తే తట్టుకోలేరు.. టిల్లు బేబీ లేటెస్ట్ పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News