S. P. Balasubrahmanyam funeral tomorrow: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బాలు అంత్యక్రియలను (SP Balu's funeral) రేపు (శనివారం) సాయంత్రం నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు చెన్నై రెడ్‌హిల్స్ సమీపంలోని తామరైపాకం వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే బాలు పార్థివదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి నుంచి కోడంబాక్కంలోని ఆయన నివాసానికి తరలించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, అభిమానులు పార్థివదేహాన్ని సందర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మరణం సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన అభిమానులు భారీగా బాలు ఇంటికి చేరుకుంటున్నారు. Also read: SP Balu మా ఊరి వ్యక్తి.. టచ్‌లో ఉన్నాను, కానీ: వెంకయ్య నాయుడు భావోద్వేగం
Tamil Nadu: Mortal remains of singer SP Balasubrahmanyam brought to his residence in Chennai.
SP Balasubrahmanyam passed away at a hospital in the city, earlier today. pic.twitter.com/z7gKvv5k0w
— ANI (@ANI) September 25, 2020
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా (Coronavirus) సోకిన తర్వాత ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. బాలు 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేలకు పైగా పాటలు పాడి ఆయన కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెల్చుకోవడంతోపాటు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. SP Balasubrahmanyam died: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు
ఇదిలాఉంటే.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదిక ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ.. ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ గానగంధర్వుడికి నివాళులర్పించడంతోపాటు కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. Also read : Salman Khan About SP Balu: ఎస్పీ బాలు సార్.. మీ పాటలు నాకెంతో ప్రత్యేకం
SP Balu's funeral: రేపు గానగంధర్వుడి అంత్యక్రియలు