RRR 2 Updates: అభిమానులకు గుడ్‌‌‌న్యూస్, ఆర్ఆర్ఆర్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో తెలుసా

RRR 2 Updates: ప్రముఖ లెజెండరీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమా సీక్వెల్‌పై కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 24, 2022, 10:39 PM IST
RRR 2 Updates: అభిమానులకు గుడ్‌‌‌న్యూస్, ఆర్ఆర్ఆర్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడో తెలుసా

ప్రపంచమంతా సంచలనం రేపి ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అభిమానులు ఆనందించే శుభవార్త ఇది. ఆర్ఆర్ఆర్ 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందనే విషయం లీకైంది. 

ఇండియన్ బాక్సాఫీసు వద్ద వేయి కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఓ సంచలనంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాకు వంద మిలియన్ వ్యూస్ లభించడం విశేషం. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్జులు దక్కించుకుంటున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డు రేసులో నిలిచింది. ముఖ్యంగా నాటు నాటు పాట షార్ట్‌లిస్ట్ కావడం గమనార్హం. ఇంతటి సంచలనం రేపిన ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే రాజమౌళి వెల్లడించాడు. బాహుబలి 2 రేంజ్‌లో క్లిక్ అవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ 2 సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మహేశ్ బాబుతో చేయనున్న సినిమా ముగిసిన తరువాత అంటే 2025లో ఆర్ఆర్ఆర్ 2 షూటింగ్ ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే 2025 షూటింగ్ షెడ్యూల్‌పై రాజమౌళి ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 

Also read: Tunisha Sharma Suicide: సహనటుడి మేకప్ రూంలో 20 ఏళ్ల సినీ నటి సూసైడ్.. అసలు ఏమైందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News