RP Patnaik: 'సైదాబాద్‌ హత్యాచార నిందితుడిని పట్టిస్తే...రూ. 50వేలు రివార్డు ఇస్తా'..

RP Patnaik: సైదాబాద్‌ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ ప్రకటించారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 03:17 PM IST
  • సైదాబాద్‌ ఘటనపై ప్రముఖ సంగీత దర్శకుడు స్పందన
  • నిందితుడిని పట్టిస్తే రూ.50వేలు రివార్డు
  • సోషల్ మీడియా వేదికగా ప్రకటన
RP Patnaik:  'సైదాబాద్‌  హత్యాచార నిందితుడిని పట్టిస్తే...రూ. 50వేలు రివార్డు ఇస్తా'..

RP Patnaik: ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌(RP Patnaik) సైతం సైదాబాద్‌ ఘటన(Saidabad Incident)పై స్పందిస్తూ.. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్ట్‌ షేర్‌ చేశారు. 

ఆర్పీ పోస్టు చేస్తూ.. ‘చిట్టితల్లికి న్యాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే నిందితుడు రాజు దొరకాలి. అతడి ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇస్తామని హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. పట్టించిన వారికి నా వంతుగా రూ.50 వేలు ఇస్తాను. అతడు దొరకాలి. చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుంది. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చు. ఒక కన్ను వేసి ఉంచండి. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసు శాఖకు మన వంతు సాయం అందిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు. 

Also Read: Saidabad Girl Case: సైదాబాద్‌ బాలిక కేసులో కీలక నిర్ణయం, నిందితుడిని పట్టించిన వారికి పెద్ద మొత్తంలో రివార్డ్

సైదాబాద్‌ చిన్నారి హత్యాచార ఘటన(Saidabad child Rape incident)పై సినీ ప్రముఖులు గళమెత్తుతున్నారు. నిందితుడిని పట్టించడంలో పోలీసులకు సహకరిద్దాం అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక మంచు మనోజ్‌(Manchu Manoj) సోమవారం బాధిత బాలిక కటుంబాన్ని పరామర్శించగా.. ఈ ఘటనపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh Babu) విచారణ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  హీరో నాని(Hero Nani) నిందితుడు బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదంటూ ట్వీట్‌ చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News