మాస్ మహరాజా ఈజ్ బ్యాక్..!

కిక్ 2 సినిమా తర్వాత... చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మాస్ అభిమానులను కనువిందు చేయడానికి వస్తున్నారు నటుడు రవితేజ. ఈయన నటించిన "రాజా ది గ్రేట్" చిత్రం ఈ అక్టోబర్ 18న విడుదల కానుంది.

Last Updated : Oct 14, 2017, 05:51 PM IST
మాస్ మహరాజా ఈజ్ బ్యాక్..!

కిక్ 2 సినిమా తర్వాత... చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మాస్ అభిమానులను కనువిందు చేయడానికి వస్తున్నారు నటుడు రవితేజ. ఈయన నటించిన "రాజా ది గ్రేట్" చిత్రం ఈ అక్టోబర్ 18న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. పూర్తి స్థాయి కామెడీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, రాధిక ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అలాగే నటి రాశిఖన్నా ఒక స్పెషల్ పాటతో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌ని రేవంత్, సాకేత్‌లతో గొంతు కలిపి రవితేజ కూడా పాడడం విశేషం. 

Trending News