Raviteja and Nani: 'రావణాసుర' 'ధరణి'తో కలిసి దసరా చేస్తే.. రచ్చ రచ్చే ఇక!

Raviteja and Nani Collective Interview: నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 19, 2023, 08:56 PM IST
Raviteja and Nani: 'రావణాసుర' 'ధరణి'తో కలిసి దసరా చేస్తే.. రచ్చ రచ్చే ఇక!

Raviteja and Nani Interview: ఈ మధ్యకాలంలో సినిమా హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడమే కాదు తమ స్నేహితులు, తమ సినిమా రిలీజ్ అవుతున్న రోజే విడుదలవుతున్న ఇతర హీరోల సినిమాలను సైతం ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఆసక్తికరంగా టాలీవుడ్ లో ఇద్దరు టైర్ 2 హీరోలు తమ సినిమాలు విడుదల కావడానికి వారం రోజుల వ్యవధి ఉన్నా ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చారు. వారిద్దరూ ఎవరో అని ఆశ్చర్యపోతున్నారా వారిద్దరూ మరెవరో కాదండోయ్ నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ.

నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా దసరా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. మార్చి 30వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కచ్చితంగా హిట్టు కొడుతుందనే నమ్మకంతో ఉన్నాడు నాని. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించారు. పూర్తిస్థాయి తెలంగాణ యాసలో సాగబోతున్న ఈ సినిమాతో తాను పుష్పలాంటి హిట్ అందుకుంటానని నాని నమ్మకంగా ఉన్నాడు.

మరోపక్క మాస్ మహారాజా రవితేజ కూడా ధమాకా, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో సూపర్ హిట్లర్ అందుకుని ఇప్పుడు రావణాసుర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ఘ నంగా రిలీజ్ అవ్వబోతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు నటించారు. రవితేజ టీం వర్క్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇక పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలకు సంబంధించిన హీరోలు ఇద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకరి సినిమాని మరొకరు ప్రమోట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: Nani On Venkatesh Maha: నీచ్ కమిన్ కుత్తే కామెంట్లపై నాని స్పందన.. జడ్జ్ చేయను అంటూ!

Also Read: Vijayashanthi Serious: 'రానా నాయుడు'పై విజయశాంతి సీరియస్..ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని నిలబెట్టుకోవాలి అంటూ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News