/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Rashmika reacts on Dating rumors With Vijay Deverakonda and Liger Movie: 'ఛలో' సినిమాతో కన్నడ అందం రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. మొదటి సినిమా హిట్ కావడంతో ఆమెకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. అందం, అభినయం ఉన్న రష్మికకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. గీతా గోవిందం, దేవ్ దాస్, డియర్‌ కామ్రేడ్‌, సరిలేరు నీకెవ్వరూ లాంటి భారీ హిట్లు కొట్టిన రష్మిక స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇక 'పుష్ప' చిత్రం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం అందుకోవడంతో.. నేషనల్ క్రష్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక చాలా సినిమాలను లైన్లో పెట్టారు. 

స్టార్ హీరోయిన్లకు వచ్చే కష్టాలు అందరికి తెలిసిందే. పాపులారిటీ పెరిగేకొద్దీ వారిపై ప్రశ్నలు కూడా పెరుగుతాయి. మీ పెళ్లెప్పుడు అని, మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని మీడియా, నెటిజన్లు అడుగుతుంటారు. ఈ పాట్లు రష్మిక కూడా పడుతున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలు రష్మిక  చేశారు. దాంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని ప్రతిఒక్కరు అనుకుంటున్నారు. ఈ వార్తలపై తాజాగా నేషనల్ క్రష్ స్పందించారు. 
 
రష్మిక మందన్న బాలీవుడ్‌లో గుడ్‌ బై సినిమా చేసిన విషయం తెలిసిందే. గుడ్‌ బై ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రష్మిక.. బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ విజయ్‌ దేవరకొండతో తన రిలేషన్‌షిప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'విజయ్‌తో దేవరకొండతో కలిసి గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలు చేశాను. ఆ సినిమాలతో మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాం. ఇప్పుడు అందరూ రష్మిక విజయ్‌ దేవరకొండ అంటూ మా రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకోవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది' అని రష్మిక అన్నారు. 

'విజయ్‌ దేవరకొండ తాజాగా నటించిన‘లైగర్‌ సినిమాను ఇటీవల చూశాను. ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మాస్‌ సినిమాలు నాకు చాలా ఇష్టం. లైగర్‌ చూస్తున్నప్పుడు విజిల్స్‌ వేయడమే కాకుండా డ్యాన్స్ కూడా చేశాను. లైగర్‌ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ..  ఆ చిత్రం ఎంతో నచ్చింది. విజయ్‌ తన నటనతో అదరగొట్టేశాడు. ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. వెల్‌డన్‌ విజయ్' అని రష్మిక మందన్న చెప్పారు.

Also Read: ఆచార్య విషయంలో అదే బాధ.. అందుకే రాజమౌళి సినిమాలో నటించను : చిరంజీవి

Also Read: Rahul Gandhi Bharath Jodo Yatra: 13 రోజులు.. 359 కిలోమీటర్లు! తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర కుదింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Section: 
English Title: 
Rashmika Mandanna reacts on Dating rumors With Vijay Deverakonda and Liger Movie
News Source: 
Home Title: 

విజయ్‌, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!

Rashmika Dating: విజయ్‌, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.. రిలేషన్‌షిప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక!
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

విజయ్‌, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది

రిలేషన్‌షిప్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక

గుడ్‌ బై ప్రమోషన్స్‌లో బిజీగా రష్మిక
 

Mobile Title: 
విజయ్‌, నా గురించి మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు!
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Saturday, October 1, 2022 - 12:58
Request Count: 
89
Is Breaking News: 
No