పోర్న్,సెక్స్ పై ఆర్జీవి తాజా అభిప్రాయాలివే..!

ఇటీవలే రామ్‌గోపాల్‌వర్మ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే పేరుతో, హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాని  పెట్టి ఓ చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అటువంటి చిత్రాలు తీస్తున్న రామ్‌గోపాల్‌వర్మ పై పలువురు మహిళా సామాజికవేత్తలు విరుచుకుపడ్డారు. కొందరు కేసులు కూడా నమోదు చేశారు. అయితే వాటన్నింటికీ సమాధానంగా ఆయన తన బ్లాగులో పోర్న్,సెక్స్ మొదలైన అంశాలపై తన అభిప్రాయాలను ఒక వ్యాసరూపంలో పంచుకున్నారు. ఆ వ్యాసం ఇదే..!

Last Updated : Jan 28, 2018, 03:48 PM IST
పోర్న్,సెక్స్ పై ఆర్జీవి తాజా అభిప్రాయాలివే..!

ఇటీవలే రామ్‌గోపాల్‌వర్మ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే పేరుతో, హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాని  పెట్టి ఓ చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అటువంటి చిత్రాలు తీస్తున్న రామ్‌గోపాల్‌వర్మ పై పలువురు మహిళా సామాజికవేత్తలు విరుచుకుపడ్డారు. కొందరు కేసులు కూడా నమోదు చేశారు. అయితే వాటన్నింటికీ సమాధానంగా ఆయన తన బ్లాగులో పోర్న్,సెక్స్ మొదలైన అంశాలపై తన అభిప్రాయాలను ఒక వ్యాసరూపంలో పంచుకున్నారు. ఆ వ్యాసం ఇదే..!

పోర్న్ అనేది శృంగార వాంఛని కలిగించే దృశ్యం అనుకుంటే, మనిషి చూసిన మొట్టమొదటి పోర్న్ ఒక స్త్రీ  (స్త్రీకి పురుషుడు ). కానీ మనిషి ప్రకృతి ఇచ్చిన సహజమైన వాటితోనే ఏనాడూ తృప్తి పడడు కాబట్టి వాటిని తనలోని క్రియేటివిటీతో పెంపొందించుకుంటూపోతాడు. ప్రకృతి మనిషికి తినడానికి కేవలం ఫలాలని,మాంసాన్ని ఇస్తే వాటిని ఈరోజు కొన్ని వేల రకాల వంటకాలగా ఎలామార్చాడో,నడవడానికి కాళ్ళు ఇస్తే వాహనాలని,విమానాలని ఎలా కనుగొన్నాడో అదే విధంగా శృంగారం విషయంలోనూ తన వాస్తవిక మరియు సృజనాత్మక చర్యలతో అభివృద్ధిపరుస్తూ నేడు మనముందుకు తెచ్చిందే ఈ ఇంటర్నెట్  పోర్న్.

కొందరి భయమేమిటంటే, పోర్న్ చూస్తే శృంగారంలోమరింత ఉత్తేజం కోసం ఎగ్క్సాగరేటెడ్  క్రియలని ఆసరాగా చేసుకోవలసివస్తుందేమో అని. అసాధారణ ప్రక్రియలు అవలంభించటమే కాకుండా,నిజజీవితంలో తమ భాగస్వాములు ఎక్కడసత్యదూరమైన కోరికలు కోరతారేమో అన్నవి వీరికున్న కొన్ని భయాలు. ఈ నమ్మకం ఎంత మూర్ఖమైనది అంటే యాక్షన్ సినిమా చూసే ఒకమహిళ అందులోని హీరో 20 మంది రౌడీలని కొట్టినట్టే తన భర్త/ ప్రియుడు కూడా అలాగేకొట్టగలతాడని తననుకుంటుందని మనం అనుకోవడం. ఆకలి తీర్చుకోవడానికి రుచికరమైన వంటలు ఒండుకోవటం ఎలాంటిదో, శృంగార కోరికలు తీర్చుకొనే ప్రక్రియలో పోర్న్ కూడా అలాంటి ఒక ఉత్తేజం కలిగించే సాధనం అని అందరూ అర్ధం చేసుకోవాలి.  పవర్ అనే ఒక సహజసిద్ధమైన వాంఛకియాక్షన్ ఫిల్మ్ ఎలాగ ఉత్తేజం ఇస్తుందో ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే శృంగార వాంఛలు మరియు పవర్రెండూ జీవిత పరమార్ధాలే కాబట్టి.చిన్న పిల్లలు పోర్న్ చూడటానికి ఆస్కారం ఉంది అనేది కూడా ఇంకొక భయం.
 
అయితే పిల్లలకి పోర్న్ ఫిల్మ్స్ బహిర్గతం అవుతాయేమో అనే భయం నాకు ఇప్పటికీ అర్ధంకాని విషయం. వాస్తవానికి సెక్షువల్ ఆవేకెనింగ్ దశ దాటని వయసువారికి ఆ బొమ్మలు అర్ధాంకావు. ఒక్కసారి వారు ఆ వయసుకి వచ్చాక, ప్రకృతిపరంగా వారిలో వచ్చే మార్పులే వారిలోని భావావేశాన్ని మేల్కొల్పుతాయి. ఇది 60 వేల సంవత్సరాల క్రితం మనుగడలోకి వచ్చిన మన పూర్వీకులైన హోమోసేపియన్స్ జాతి నుంచి జరుగుతున్న నగ్న సత్యం...  శృంగార క్రియలన్నీ పోర్న్ అనేదిసృష్టించబడటానికి వందలాది సంవత్సరాల క్రితమే హరప్పా-మొహంజుదారో నాగరికత నుంచి గ్రీకుల,రోమీయుల, ఐగుప్తీయుల మరియు వందల సంవత్సరాల క్రితమే నిర్మించబడిన మన సొంత పవిత్ర దేవాలయాలపైన కూడా ప్రతిబింబించాయి.

శృంగారపరమైన నిర్ణయాలు తీసుకొనే స్వేచ్చా స్వాతంత్ర్యాలు ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఇతరుల సెక్స్ కోరికలపై నిర్ణయాధికారం ఖచ్చితంగా పరీక్షించబడిన మరియు సాంకేతికంగాను,శాస్త్రీయాంగాను సమతుల్యత కలిగిన స్థిరత్వం కలిగినప్పుడే ఉండాలి తప్పితే మూర్ఖమైన లేదా హైపోక్రిటికల్ మొరాలిటీ పేరిట అనాగరికమైన పోకడలతో నిండిన సమాజం యొక్క స్వయంప్రతిపాధిత నైతిక పరిరక్షకులకుఉండకూడదు.
 
శృంగారం అనేది చాలా శక్తివంతమైన సాధన కాబట్టి పోర్న్ కొందరు మనుషులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నమాట కొన్ని చాలా  అరుదైనసందర్భాలలో వాస్తవమే. అయితే ఈ కారణంగా పోర్న్ ని నిషేధించడం అనేది అప్పుడప్పుడు జరిగే ప్రమాదాల కారణంగా ట్రాఫిక్ ని నిషేధించటంలాంటిది. మన సమాజంలోని పెద్దలు తమ పిల్లలతో శృంగారం గురించి మాట్లాడటానికి భయపడతారు. వారు సంయమనం పాటిస్తూ కేవలం మెడికల్  సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఆధారపడటం వలన అది అస్వీకృత పరిణామాలకి దారితీస్తున్నాయి. కానీ నేటిపిల్లలు ఇంటర్నెట్ ద్వారా అన్నీ విషయాలు తెలుసుకుంటారు,శృంగారం గురించి కూడా తెలుసుకోవటమే కాకుండా మనం మన సొంత అభిప్రాయాలను ఎలా ఏర్పరచుకున్నామో వారు కూడా తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటున్నారు.

కానీ ఇప్పుడు పోర్న్ గురించిన తెలిసీ తెలియనిప్రచారాలు అవి మనలని దానిని ఆస్వాదించకుండా చేయడమే కాకుండా తప్పుడు అపోహలవైపు మళ్లించే ప్రమాదంలో పడేస్తున్నాయి.  పోర్న్ కేవలం మనలోని శృంగార వాంఛలకి ఒక ఉత్ప్రేరకం మరియు ఊహాతీత కోరికలకు దిక్సూచి వంటిది మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. పోర్న్ చూడటం వలన చాలావరకు లైంగిక నేరాలు తగ్గుతాయనటానికి అన్నీ దేశాల్లోకి అడ్వాన్స్డ్ కంట్రీ అయిన అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. పోర్న్ లైంగిక నేరాలకి అనువైన వాతావరణం కల్పించటానికి బదులు లైంగిక నిరాశానిసృహల నుంచి మనసులని విడుదల చేస్తుంది. ఇక దీని మానసిక ప్రభావల గురించి మాట్లాడుకుంటే, ఒక మాఫియా సినిమాని ఇష్టపడినంత మాత్రాన ఒకడు మాఫియాలో ఎలా చేరడో అదే విధంగా ఒకడు తనబాస్ ని కొట్టాలనుకున్నంత మాత్రాన నిజంగా కొట్టడు, లేదా రోడ్డు మీద కనపడిన అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలన్న కోరిక పుట్టినంత మాత్రాన ఆ పని నిజంగా చెయ్యడు.

ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా ఏదైనా చాలా తేలికగా తెలుసుకొనే దశలో ఈరోజు ప్రపంచం ఉంది, అది పోర్న్ అయినా మరొకటి అయినా. పోర్న్ దానంతట అది ఇక్కడ లేదు, ఎన్నో కోట్లమంది దానిని చూసి ఆస్వాదించటం వలననే అది ఉంది. . ఈ కారణంగానే అభివృద్ధి చెందిన దేశాలెన్నోప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ తమ ప్రజల కోరికలకిముఖ్యంగా వయసు వచ్చినవాళ్ళ కోరికలకివిరుద్ధంగా ఉండరాదని భావించి శృంగార స్వేచ్చని ఇచ్చాయి. తమ శృంగార క్రీడలని కెమెరాలో బంధించటం మరియు తిరిగి చూస్తూ ఆస్వాదించటం అనేది మనుషులు తమ ఇష్టానుసారంగా,మనస్ఫూర్తిగా చేస్తున్నారు, వారిని వ్యతిరేకించటానికి ఇతరులకి ఎలాంటి హక్కులేదు.......... ఒక పోర్న్ కేసులో అమెరికా యొక్క సుప్రీం కోర్టు – “మీకు పోర్న్ ఇష్టం లేకపోతే చూడకండి, కానీ చూడటానికి ఇష్టపడే వారిని అడ్డగించకండి” అని తీర్పిచ్చింది.

శృంగార స్వేచ్ఛనిచ్చిన దేశాలన్నీ అంతగా అభివృద్ధి సాధించటానికి కారణం పోర్న్ కాదుగానీ అదే సిస్టమ్ కి వారి యొక్క వ్యక్తిగత కోరికలను గౌరవించేలక్షణముండటం దానికి కారణం. పోర్న్ ని ఈ ప్రపంచం ఒక వాస్తవంగా పరిగణించటం మొదలుపెడితే ఇక మన౦ దానిని ఒక నిషిద్దమైన క్రియగా చెప్పాల్సిన లేక చూపాల్సిన అవసరం ఎంతమాత్రమూ ఉండదు. దానిని బాహాటంగా చర్చించుకోవచ్చు. ఇతరులకి పోర్న్ గురించి తెలునన్న విషయం మీకు తెలుసని వారు తెలుసుకున్నప్పుడు అందులో ఏమైనా లోపాలు లేదా తప్పులు ఉన్నట్టైతే వాటి గురించి మీరు నిర్భయంగా బహిరంగంగా వారితో  చర్చించవచ్చు. నిజానికి ధూమపానం మరియు మధ్యపానాల వలన ప్రాణహాని కలుగుతుందే తప్ప శృంగారం వలన కాదు. అయినప్పటికి ఎక్కడలేని పరిమితులు దానికేవిధిస్తారు. 

కేవలం కొందరు అపరిణిత వ్యక్తులు సమాజాన్ని కొన్ని విషయాలలో అనవసరంగా పరిమితంగా ఉంచడానికి చేసే దుష్ట ప్రయత్నాలలో భాగమే God, Sex, Truth and Pornని నిషేధించమని ప్రొటెస్ట్ చెయ్యడం... నిజయతీ ఉన్న వ్యక్తుల యొక్కస్వేచ్ఛస్వాంతంత్ర్యాలు హరించటానికి హిపోక్రసితో కలుషితమైన అలాంటివాళ్ల ప్రయత్నాలని తిప్పి కొట్టి మీలో ప్రతి ఒక్కరూ తమని తాము నిరోధించుకోవటం మాని బయటికివచ్చి నాతో కలిసి గొంతు ఎత్తి “నాకు సెక్స్ అంటే చాలా ఇష్టం” అని గట్టిగా అరచి చెప్పాలని నా కోరిక.

ఇట్లు మీ
రామ్ గోపాల్ వర్మ

Trending News