Ramayana the Legend of Prince Animation Movie Review: రామాయణం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కట్టె, కొట్టే, తెచ్చే అనే టైపులో రాముడు వారధి కట్టి లంకలో రావణాసురుడిని కొట్టి.. సీతమ్మవారితో తిరిగి అయోధ్యకు వెళ్లిన కథ. బాల కాండ నుంచి యుద్ధ కాండ వరకు ఆరు కాండల్లో రామాయణాన్ని చెబుతున్నారు. ఎవరు తెరకెక్కించిన అదే రీతిన తెరకెక్కించాల్సిందే. మరి జననీస్ వాళ్లు మన భారతీయులతో కలిసి తెరకెక్కించిన ఈ యానిమేషన్ మూవీ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం..
కథ విషయానికొస్తే..
రామాయణం కథ గురించి చెప్పాలంటే మన వాల్మీకి రాసిన రామాయణ మహా కావ్యాన్నే ఎక్కడా పొల్లు పోకుండా ఈ సినిమాను ఉన్నది ఉన్నట్టు తెరకెక్కించారు. అయోధ్యలో రామ జననం.. ఆపై విశ్వామిత్రా మహర్షి యాగ సంరక్షణ కోసం వెళ్లడం.. అక్కడ సీతాపరిణం.. ఆపై తండ్రి కోరిక ప్రకారం 14 యేళ్ల వనవాసం.. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుని కోయడం.. కోపంతో మాయవేషంలో వచ్చి రావణాసురుడు సీతను అపహరించడం.. సీతను కాపాడేందుకు హనుమంతుడితో కలిసి సుగ్రీవుడి సాయం తీసుకోవడం.. లంకలో సీత జాడను హనుమంతుడు కనిపెట్టడం.. అక్కడ లంకకు నిప్పు పెట్టి గందరగోళం చేయడం.. ఆపై లంకలో సీతమ్మ వారు ఉన్నదన్న విషయం హనుమా ద్వారా తెలుసుకొని రాముడు .. లంకపై వానర సైన్యంతో వారధి నిర్మించి దానిపై లంకకు చేరుకొని రావణాసురుడిని సంహరించి సీతమ్మతో కలిసి అయోధ్యకు పుష్పక విమానంలో తిరుగు ప్రయాణం అవ్వడం ఇది రామాయణ కథ. దీన్ని మన మేకర్స్ ఏ విధంగా తెరకెక్కించారో విశ్లేషణలో చూద్దాం..
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
కథనం, విశ్లేషణ..
రామాయణ కావ్యం పై తెలుగు, హిందీ సహా ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ముఖ్యంగా తెలుగు వారు రామాయణ కావ్యపై తెరకెక్కించిన సినిమాలు బహుశా ఎవరు తెరకెక్కించలేదేమో. రామాయణంపై వెండితెరపై ఇప్పటికే మనం ఎన్నో సినిమాలను చూశాం. ఎందరో నటీనటులు రామాయణంలోని పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ జపాన్ వాళ్లు 31 ఏళ్ల క్రితం భారతీయులతో కలిసి ‘రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ అనే పేరుతో సినిమాను యానిమేషన్ రూపంలో అద్భుత తెరరూపమిచ్చారు. ఇది పూర్తిగా జపాన్ యానిమేటెడ్ స్టైల్‌లో తెరకెక్కించారు. 1997లోనే జపాన్‌లో విడుదలవ్వగా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనేక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ చిత్రోత్సవోత్సవాల్లో ప్రదర్శించారు.
తాజాగా ఈ యానిమేటేడ్ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో గీక్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, AA ఫిలిమ్స్ సంస్థలు 4K టెక్నాలజీలో రిలీజ్ చేసాయి. నేటి పిల్లలకు మన రామయణ, మహా భారతలపై అవగాహన లేదు. ఏదో కొద్ది మంది తల్లిదండ్రులు మాత్రమే వారి పిల్లలకు ఇవి రామాయణ, మహా భారతాలు చెబుతున్నారు. అలా ఇప్పటి తరానికి ఈ యానిమేషన్ ద్వారా రాముడి గొప్పతనాన్ని తెలుసుకునేలా చేయడంలో ఈ సినిమా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా చిత్రాన్ని వాల్మీకి రామాయణం నేపథ్యంలో వరుస క్రమంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డబ్బింగ్, ఇతరత్రా అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. జపాన్‌కి చెందిన కోయిచి ససకి, యుగో సాకి, మన దేశానికి చెందిన రామ్ మోహన్‌లు కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్నో ఏళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటి తరానికి పెద్ద బాలశిక్షలా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. యానిమేషన్ చిత్రాలను ఇష్టపడే పిల్లలకు మన కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలను చెప్పడం ద్వారా మన సంస్కృతిని ముందు తరాల వారికి అందించిన వారమవుతాము.
మొత్తంగా ఇందులో ప్రతి పాత్ర తాలూకు ఆహార్యంపై చక్కని శ్రద్ద చూపించడం మెచ్చుకోదగ్గ అంశం.
చివరి మాట.. రామాయణం.. యానిమేషన్ చిత్రం ఇప్పటి తరం తప్పక చూడాల్సిన చిత్రం..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.