Game Changer OTT Rights: కళ్లు చెదిరే రికార్డు రేటుకు అమ్ముడు పోయిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్..

Actor Ram Charan's Game Changer OTT Rights Price : రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్‌ గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్మడుపోయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 20, 2024, 11:35 AM IST
Game Changer OTT Rights: కళ్లు చెదిరే రికార్డు రేటుకు అమ్ముడు పోయిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్..

Actor Ram Charan's Game Changer OTT Rights Price : దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' (RRR) మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. అంతేకాదు ఈ పాత్రలో చరణ్ ఒదిగిపోయిన తీరుపై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి కంటే ముందు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన  శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు.ఈ సినిమాలో రామ్ చరణ్‌ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్ చరణ్‌. ఈ సినిమా ఈ యేడాది చివర్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇక అంతకు ముందు ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్ ఖరారైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఐదు భాషలకు కలిపి దాదాపు రూ. 100 కోట్లు పలికినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ పెరగడంతో పాటు శంకర్ దర్శకత్వం కలగలిసి ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ భారీ రేటుకు అమ్ముడుపోయింది. అందుకే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ ఈ రేటు పెట్టి కొనుగోలు చేసింది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. మొత్తం అన్ని భాషలకు సంబంధించిన దాదాపు రూ. 50 కోట్లు పలికినట్టు సమాచారం. అంతేకాదు మ్యూజిక్ రైట్స్ సరేగమ వాళ్లు రూ. 25 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఈ రకంగా నాన్ థియేట్రికల్‌గానే నిర్మాతకు రూ. 175 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ దక్కడం మాములు విషయం కాదు.

ఈ సినిమాలో రామ్ చరణ్  పాత్రతో పాటు  ముఖ్యమంత్రి పాత్రకు మంచి స్కోప్ ఉందట. ఈ రోల్‌ను మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో చేయించాలని చూస్తున్నారట. ఇప్పటికే శంకర్ వెళ్లి ఈ సినిమా స్క్రిప్ట్ మోహన్‌లాల్‌కు వినిపించాడట. ఆయన కూడా స్టోరీ నచ్చి ఈ సినిమాలో క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌..  రామ్ నందన్ అనే IAS అధికారి పాత్రలో నటిస్తున్నాడట. ఈ క్యారెక్టర్ మాజీ ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ స్పూర్తితో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే రోజున విడుదల చేయనున్నారు.

'గేమ్ ఛేంజర్' మూవీని దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ..గేమ్ ఛేంజర్ మూవీ కంప్లీట్ చేస్తూనే.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమా లో  రామ్ చరణ్‌ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం జాన్వీ..  ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రానుంది.

Also read: AP Summer Holidays: విద్యార్ధులకు శుభవార్త, ఈసారి ముందస్తు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News