Pawan Kalyan OG: ఆర్ఆర్ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ తన సత్తా చాటి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. అయితే ఆ సినిమా వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఈ మెగా హీరో నుంచి నెక్స్ట్ మూవీ ఇంకా రాలేదు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్.. గేమ్ చేంజర్ అనే మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఎప్పుడో విడుదల కావలసిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాలవల్ల షూటింగ్ డిలే అవుతూ ఇచ్చింది. దీంతో ఈ మూవీ ఈ ఇయర్ ఖచ్చితంగా విడుదలవుతుంది అని చెర్రీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు కమల్ హాసన్ భారతీయుడు 3 చిత్రం పై ఫుల్ ఫోకస్ పెట్టిన శంకర్ గేమ్ చేంజర్ ని త్వరలో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోపక్క దిల్ రాజ్ కూడా ఈ మూవీని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తెగ ట్రై చేస్తున్నారు.
ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27 లేక గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ మొదటివారం ఈ మూవీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఇన్సైడ్ టాక్.
హమ్మయ్య చెర్రీ మూవీ వస్తుంది అని ఊపిరి తీసుకునే టైంకి.. సెప్టెంబర్ 27న థియేటర్ల పై దండయాత్రకి ఓజి మూవీ తో పవన్ వస్తున్నాడు. ఈ ఊహించని పరిణామం అందరినీ షాక్ కి గురిచేస్తుంది.
అబ్బాయి సినిమా వచ్చే టైంకి బాబాయ్ పోటీగా రావడం కాస్త ఇబ్బంది గా మారింది. ఎన్నికల టైం కాబట్టి పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ ఆలస్యం అవుతాయని అందరూ అనుకున్నారు. అయితే 20 రోజులు తనకు కాల్ షీట్స్ ఇస్తే మూవీ పూర్తి చేస్తాను అని డైరెక్టర్ సుజిత్ పవన్ ని కన్విన్స్ చేయడంతో..ఆయన ఓకే చెప్పారు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయం పై స్పష్టత లేదు కానీ మొత్తానికి ముందుగానే రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది.
పోనీ డేట్ మారుద్దామా అంటే రామ్ చరణ్ సినిమా ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఆగస్ట్ లో బన్నీ పుష్ప 2 ది రూల్ వస్తోంది.ఇక సంక్రాంతికి రావడం మరింత కష్టమవుతుంది. మెగాస్టార్ నెక్స్ట్ సంక్రాంతికి ఆల్రెడీ డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. సమ్మర్ సీజన్ లో దేవర ఉండనే ఉంది. మరోపక్క శంకర్ మరొక మూవీ భారతీయుడు 2 డేట్స్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు. మరి ఈ నేపథ్యంలో చెర్రీ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం పెద్ద డైలమాగా మారింది.
Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి