Rajkummar Rao: ఇల్లమ్మేసిన జాన్వీ కపూర్… కోట్లు కుమ్మరించి కొన్న స్టార్ హీరో.. లాభం ఎంతో తెలుసా?

Rajkummar Rao Buys Janhvi Kapoor House: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నుండి ఇంటిని స్టార్ హీరో భారీ ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేశారు. దాని ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2022, 07:14 PM IST
  • ఇల్లు అమ్మేసిన జాన్వీ కపూర్
  • రెండేళ్ళలోనే కోట్ల లాభం
Rajkummar Rao: ఇల్లమ్మేసిన జాన్వీ కపూర్… కోట్లు కుమ్మరించి కొన్న స్టార్ హీరో.. లాభం ఎంతో తెలుసా?

Rajkummar Rao Buys Janhvi Kapoor House: బాలీవుడ్ తారలు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని గృహ నిర్మాణం సహా పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు రాజ్‌కుమార్ రావు ఒక ఆస్తి కొనుగోలు చేశారు. రాజ్‌కుమార్‌రావు తన కోసం ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజ్‌కుమార్ రావు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నుండి ఈ ఇంటిని కొనుగోలు చేశారు.

తాజాగా రాజ్‌కుమార్ రావు విలాసవంతమైన ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రాజ్‌కుమార్ ఈ అపార్ట్‌మెంట్‌ను జాన్వీ కపూర్ నుండి 44 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్ ముంబైలోని జుహు లొకేషన్ లో ఉంది. రాజ్‌కుమార్‌, జాన్వీ కలిసి 'రూహి' సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపించింది. రాజ్‌కుమార్ ఈ ఇంటిని కొనుగోలు చేయడం వలన జాన్వీ కోట్ల లాభం అందుకుంది.

సరిగ్గా 2 సంవత్సరాల క్రితం జాన్వీ కపూర్ స్వయంగా ఈ ఆస్తిని కొనుగోలు చేసింది. జాన్వీ 2020 డిసెంబర్‌లో 39 కోట్ల రూపాయలకు ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ ద్వారా జాన్వీకి రూ.5 కోట్ల లాభం వచ్చిందన్న మాట. ఇక ఈ అపార్ట్మెంట్ 3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని ఒక్కో చదరపు అడుగు ధర రూ.1.27 లక్షలు. దేశంలోనే అత్యంత ఖరీదైన డీల్స్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పచ్చు.

ఈ అపార్ట్‌మెంట్ ను బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, బిల్డర్ ఆనంద్ పండిట్ నిర్మించారు. ఈ భవనాన్ని లోటస్ ఆర్య అని పిలుస్తారు. రాజ్‌కుమార్ రావు తన భార్య పాత్రలేఖతో కలిసి ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్ 14వ, 15వ అలాగే 16వ అంతస్తు వరకు ఉంటుంది. ఈ భవనంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం నివసిస్తున్నారు. రాజ్‌కుమార్‌, పత్రలేఖ గతంలో ఇదే భవనంలోని 11, 12 అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు మరో అపార్ట్మెంట్ ను కూడా వారు దక్కించుకున్నారు. 

Also Read: Malaika Arora: మలైకాకు షాక్.. అక్కడ చేయి పెట్టబోయిన వ్యక్తి.. దెబ్బకు జడుసుకుందిగా!

Also Read: Tollywood: టాలీవుడ్ నిర్మాతల్లో ముసలం.. షూటింగ్స్ ఆపేది లేదు.. గిల్డ్ కు షాకిచ్చిన ఫిలిం ఛాంబర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News