Rajinikanth’s Annaatthe: మిశ్రమ స్పందన దక్కినా.. 'పెద్దన్న'కు రూ.100 కోట్లు!

Peddanna Movie: దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన రజనీకాంత్ అన్నత్తే (పెద్దన్న) రూ.100 కోట్ల క్లబ్​లో చేరింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 11:36 PM IST
  • రూ.100 కోట్ల క్లబ్​లో 'పెద్దన్న' సినిమా
  • మూడు రోజుల్లోనే సాధించిదన్న సినీ విశ్లేషకులు
  • ఇటీవలే వంద కోట్లు సాధించిన 'డాక్టర్' మూవీ
Rajinikanth’s Annaatthe: మిశ్రమ స్పందన దక్కినా.. 'పెద్దన్న'కు రూ.100 కోట్లు!

Rajinikanth’s Annaatthe: తలైవా రజనీకాంత్​ నటించిన అన్నాత్తే (తెలుగులో 'పెద్దన్న') తమిళంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

దీపావళి సందర్భంగా రిలీజ్​ అయిన ఈ సినిమా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇక విమర్శకుల నుంచి ప్రతి స్పందన అందుకుంది. అయినప్పటికీ.. మూడు రోజుల్లోనే ఈ స్థాయిలో అన్నత్తే వసూళ్లు రాబట్టడం విశేషం.

రూ.100 కోట్ల క్లబ్​లో చేరిన రజనీకాంత్ తొమ్మిదో సినిమాగా కూడా అన్నత్తే నిలిచింది.

Also read: Shah Rukh Khan viral video: మీడియా నుంచి తప్పించుకునేందుకు SRK పాట్లు.. వీడియో వైరల్

ఈ సినిమాలో రజనీకాంత్​కు జోడీగా నయనతార నటించారు. మహానటి ఫేమ్​ కీర్తి సురేశ్​ రజనీకాంత్ సోదరిగా కనపించారు. సీనియర్ నటీమణులు మీనా, ఖుష్పూలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు శివ, సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించగా.. తెలుగులో,. డి.సురేశ్​ బాబు, నారణ్​దాస్​ నారంగ్​,  దిల్​రాజులు డిస్ట్రిబ్యూట్​ చేశారు.

Also read: IFFI Awards 2021: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి సమంతకు ఆహ్వానం.. తొలి దక్షిణాది నటిగా ఘనత

Also read: Allu Ayaan Ghani Anthem: బాక్సర్ గా మారిన అల్లు అర్జున్ తనయుడు.. జిమ్ లో వర్కౌట్స్ వీడియో వైరల్

శివకార్తికేయన్​ సినిమా కూడా..

కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలో సినిమా రిలీస్ చేసేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్న సమయంలో కొంత మంది దైర్యం చేసి సినిమాను విడుదల చేస్తున్నారు. మరికొంత మంది ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. 

అలా థియేటర్లలో విడుదలైన చిన్న సినిమా డాక్టర్​ (తెలుగులో వరుణ్​డాక్టర్)​. కూడా ఇటీవల రూ.100 కోట్ల క్లబ్​లో చేరినట్లు సిని విశ్లేషకులకు తెలిపారు. ఇటీవలి కాలంలో రు.100 కోట్ల క్లబ్​లో చేరిన చిన్న సినిమా ఇదే కావడం గమనార్హం.

ఈ సినిమాలో శివకార్తికేయన్​కు జంటగా.. నాని గ్యాంగ్​ లీడర్ ఫేమ్​  ప్రియాంక అరుళ్ మోహ‌న్‌ హీరోయిన్​. యోగిబాబు, విన‌య్ రాయ్‌, మిలింద్ సోమ‌న్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

శివ కార్తికేయన్ స్వయంగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నెల్సన్​ దిలీప్ కుమార్​ దర్శకత్వం వహించగా.. అనిరుధ్​ మ్యూజిక్ అందించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also read: Akhanda Title Song: ‘అఖండ’ టైటిల్ సాంగ్ వచ్చేసింది.. అఘెరా లుక్ లో బాలయ్య

Also read: Vijay Sethupathi: ఆ దాడి ఘటనపై విజయ్ సేతుపతి ఏమన్నాడో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News