Puvvada Ajay Kumar Met Jr NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలవడం ఇప్పుడు అటు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. సుమారుగా 2009 ఎన్నికల తర్వాత ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో జోలికి వెళ్లలేదు.
అయితే అడపా దడపా ఆయన అభిమానులు ఆయన టీడీపీని చేజెక్కించుకోవాలని లేదా టిడిపిలో యాక్టివ్ గా ఉండి రాజకీయాల్లో కూడా యాక్టివ్ కావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు రాజకీయాల మీద ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు ఈ మధ్య కాలంలో కూడా బిజెపిలో మోడీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా పేరు ఉన్న అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలవడం చర్చనీయాంశమైంది. ఆయనను బిజెపిలో చేరమని కోరేందుకు లేదా బీజేపీ తరఫున ప్రచారం చేయమని కోరేందుకే కలిసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
కానీ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రశంసించడానికి అనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం కూడా చర్చనీయాంశమవుతోంది. అసలు విషయం ఏమిటంటే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహాన్ని తెలంగాణలో ఆవిష్కరించ బోతున్నారు.
Also Read: Venuswami: అఖిల్ పతనానికి అమలే కారణం.. వేణుస్వామి సంచలన కామెంట్స్!
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ మీద 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ని ఆయన నివాసంలో కలిసి విగ్రహావిష్కరణ, ఆ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఇక మే 28న శ్రీకృష్ణుని అవతారంలో రూపుదిద్దుకున్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించబోతున్నారు.
మే 28న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహ ఆవిష్కరణ ఎన్టీఆర్ చేతుల మీదుగా జరగనుంది. బేస్మెంట్ తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో కేవలం తల భాగం ఐదు అడుగులు కాళ్ల భాగం 5 అడుగులు మిగతా శరీరమంతా కలిసి 45 కు అడుగులు ఉండేలాగా విగ్రహం సిద్ధం చేశారు. ఇక ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ మీద ఈ విగ్రహాన్ని కూర్చోబెట్ట బోతున్నారు. సుమారు రెండు కోట్ల 30 లక్షల వ్యయంతో ఈ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన అన్ని అనుమతులు రాష్ట్ర రవాణా మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ చొరవతో చాలా త్వరగా పూర్తయ్యాయి. ఇక ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అవసరమయ్యే నిధులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సహా తానా సభ్యులు కొందరు, పలువురు విదేశాల్లో స్థిరపడిన పారిశ్రామికవేత్తలు భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు సమకూరుస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పువ్వాడ దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అదే రోజు ఖమ్మం మాత్రమే వెళ్తారా లేక ఒకవేళ టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏమైనా సంబరాలు జరిపితే అక్కడికి కూడా వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది చూడాలి ఏం జరగబోతోంది అనేది.
Also Read: Ravipalli Rambabu: స్కాంకి పాల్పడ్డ టాలీవుడ్ డైరెక్టర్.. డబ్బు కోసం ఇంత నీచమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook