Pushpa The Rise: కుంభస్థలాన్ని కొట్టేందుకు సిద్దమవుతున్న పుష్ప.. గట్టిప్లానే వేశారే!

Pushpa The Rise Grand Release in Russia: పుష్ప సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు, కొద్దిరోజుల క్రితం మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న పుష్ప సినిమాను ఇప్పుడు రష్యన్ భాషలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 7, 2022, 05:28 PM IST
Pushpa The Rise: కుంభస్థలాన్ని కొట్టేందుకు సిద్దమవుతున్న పుష్ప.. గట్టిప్లానే వేశారే!

Pushpa The Rise Grand Release in Russia: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ సినిమా తెలుగులోనే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో అద్భుతమైన కలెక్షన్లు సాధించిన ఈ సినిమా హిందీలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే రెండో భాగం మీద దర్శక నిర్మాతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ఈ డిసెంబర్ నెలలో ఈ సినిమాని రష్యాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే గత సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని ఇంగ్లీష్ అలాగే రష్యన్ సబ్ టైటిల్స్ తో మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఈ క్రమంలో పుష్ప సినిమాకి అక్కడ అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఆ స్పందన చూసిన దర్శక నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే దాన్ని రష్యన్ భాషలో డబ్బింగ్ చేయించి పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే గత ఏడాది పుష్ప సినిమా ఇక్కడ రిలీజ్ చేసిన డేట్ కే ఈ ఏడాది రష్యన్ పుష్ప రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతేగాక ఇంకా ఎలాగో షూటింగ్ ప్రారంభం కాలేదు కాబట్టి సినిమా టీమ్ అంతా రష్యా ప్రమోషన్స్ కి కూడా వెళ్లే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాని కూడా రష్యాలో పెద్ద ఎత్తున విడుదల చేశారు. గతంలో మరే భారతీయ సినిమాకు దక్కినన్ని స్క్రీన్లు ఈ ఆర్ఆర్ఆర్ సినిమాకి దక్కాయి. పెద్ద ఎత్తున విడుదల కావడంతో రష్యా నుంచి కలెక్షన్లు కూడా మంచిగా వచ్చాయి,=. ఆ సినిమాని మొత్తం రష్యాలోని 56 పట్టణాల్లో రిలీజ్ చేశారు.

యష్ రాజ్ ఫిలిం సంస్థ ఆర్ఆర్ఆర్ ను రష్యాలో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బ్యానర్ తో డీల్ కుదుర్చుకుందని గట్టిగానే రష్యా నుంచి కలెక్షన్లు రాబట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ రష్యా ప్రమోషన్స్ అయిన తర్వాత షూట్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Telugu Movies in Theatres: సమంత ''యశోద'' మొదలు తెలుగు నుంచి థియేటర్లు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Also Read: Allu Arjun on Pushpa The Rule : ఇది కూడా అప్డేటేనా?.. అల్లు అర్జున్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News