Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 టికెట్ రేట్స్ పెంపు.. పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు..

Pushpa 2 Ticket Rates: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా పుష్ప 2 టికెట్ రేట్స్ పెంచుకోవడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 3, 2024, 06:17 AM IST
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 టికెట్ రేట్స్ పెంపు.. పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు..

Pushpa 2 Ticket Rates: అనుకున్నదే జరిగింది. ఇప్పటికే తెలంగాణలోని అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యంగా మైత్రీ నిర్మాతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నందమూరి బాలకృష్ణతో మంచి అనుబంధమే ఉంది. మరోవైపు అల్లు అర్జున్ కు బాలయ్యతో మంచి అనుబంధమే ఉంది. అటు పవన్ వరుసకు మామ అవుతారన్న సంగతి తెలిసిందే కదా. గత కొన్నేళ్లుగా మెగాభిమానులందూ అల్లు అభిమానులు వేరయా అంటూ బన్ని సొంత కుంపటి పెట్టుకోవడంతో మెగాభిమానుల్లో ఓ వర్గం అల్లు అర్జున్ తీరుపై గుర్రుగా ఉన్నారు.

పైగా గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను కాదని.. తన ఫ్రెండ్.. శిల్పా రవి కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయడం వీరి మధ్య దూరం పెంచాయి. దీనిపై పెద్ద రచ్చే నడిచింది. కానీ అవేమి మనసులో పెట్టుకోకుండా.. పుష్ప 2 మూవీ టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ముందు రోజు తెలంగాణలో మాదిరే రాత్రి ప్రీమియర్స్ కు రూ. 800 పెంచుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది.

మరోవైపు సింగిల్ స్క్రీన్స్ కు రూ. 150 పెంపు.. మల్టీప్లెక్స్ లో రూ. 200 పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 17 వరకు  ఈ పెంపు అమల్లో ఉండనుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం మామగారైన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.  మొత్తంగా తెలంగాణ మాదిరే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పెరిగిన టికెట్స్ ఎన్ని రోజులు ఉంటాయనేది చూడాలి. మొత్తంగా పెరిగిన టికెట్ రేట్స్ ను అభిమానులు పట్టించుకోరు కానీ.. ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం సినిమాకు వెళ్లాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. ఇక కుటుంబానికి ఈ రేట్స్ భారమే అయినా.. సినిమా బాగుంటే అవేమి పట్టించుకోరు. పైగా సినిమా అనేది నిత్యావసరం కాదు. కాబట్టి సినిమా చూడాలనుకునే వాళ్లు ఎంత రేటైనా పెట్టడానికి వెనకాడరు. కంటెంట్ బాగుంటే.. పుష్ప 2 మూవీని ఆపడం ఎవరి తరం కాదు.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News