Priyanka Jawalkar: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్.. దెబ్బకు బాలయ్య సినిమా ఛాన్స్!

Priyanka Jawalkar in For Balakrishna- Anil Ravipudi Film: బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ అనుకున్నారు కానీ ఆమె ప్లేస్ లో ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ వచ్చిందని తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 6, 2022, 05:35 PM IST
Priyanka Jawalkar: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరోయిన్.. దెబ్బకు బాలయ్య సినిమా ఛాన్స్!

Priyanka Jawalkar Roped in For Balakrishna- Anil Ravipudi Film: నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే గాక అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే మరో షో ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన 107వ సినిమా చేస్తున్నాడు. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్ళీ మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన భార్య బాలకృష్ణ చెల్లెలి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 12వ తేదీ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తన 108వ సినిమాని బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయాల్సి ఉంది ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ ను ఫైనల్ చేశారు.

బాలకృష్ణ కుమార్తె పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే బాలకృష్ణ భార్య పాత్ర కోసం సోనాక్షి సిన్హాని సంప్రదించారని ప్రచారం జరిగింది. అయితే తనను బాలకృష్ణ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని ఈ విషయం అంతా ఫేక్ అని అలాంటి వార్తలు నిజం కాదని చెబుతూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే వాస్తవానికి ఈ సినిమాలో నటించమని అనిల్ రావిపూడి సోనాక్షి సిన్హా దగ్గరకు వెళ్లడం నిజమే అయితే ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ అమౌంట్ విన్న తర్వాత ఆమెతో సినిమా చేయడం కంటే లోకల్ లో ఎవరైనా హీరోయిన్స్ తో చేయిస్తే బాగుంటుందని ఆయన నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగానే పలువురు పేర్లు పరిశీలించిన తర్వాత చేసిన మొదటి సినిమాతోనే హిట్ అందుకుని ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాతో మరింత పేరు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ ను బాలకృష్ణ సరసన హీరోయిన్ గా తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోషూట్ జరిగిందని అంటున్నారు. ఇక డిసెంబర్ 8న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 

Also Read: Yashoda Ott Release: కోర్టు కేసులు క్లియర్.. ఆరోజే ఓటీటీలో యశోద మూవీ !

Also Read: Ante Sundaraniki Bamma: అంటే సుందరానికి బామ్మ బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా.. సితార, అల్లు అర్హలకు కూడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News