Priyanka Chopra Necklace : ప్రియాంక నెక్లెస్‌ ధర ఎంతో తెలిస్తే షాక్.. వందల కోట్ల ధర?

Priyanka Chopra Necklace ప్రియాంక చోప్రా నెట్టింట్లో ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది. మెట్ గాలా  2023లో ప్రియాంక మెరిసింది. ఈ ఈవెంట్‌లో ప్రియాంక ధరించిన నెక్లెస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు వందల కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2023, 11:02 PM IST
  • నెట్టింట్లో ప్రియాంక చోప్రా సందడి
  • ఆమె ధరించిన నెక్లెస్‌పై చర్చలు
  • రెండు వందల కోట్లపైనే ఖర్చైందట
Priyanka Chopra Necklace : ప్రియాంక నెక్లెస్‌ ధర ఎంతో తెలిస్తే షాక్.. వందల కోట్ల ధర?

Priyanka Chopra Necklace ప్రియాంక చోప్రా ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రియాంక చోప్రా ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అది అంతర్జాతీయ వెబ్ సిరీస్ కావడంతో అందులో మరింతగా రెచ్చిపోయి నటింది. బోల్డ్ సన్ని వేశాల్లో ప్రియాంక రెచ్చిపోయి నటింది. దారుణంగా ఎక్స్‌పోజ్ చేస్తూ నటించిన సీన్లు, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అలా ప్రియాంక చోప్రా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఇక ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఈ ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని రూమర్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న అయితే ఉమైర్ సంధు అనే వ్యక్తి దారుణమైన ఆరోపణలు చేశాడు. నిక్ జోనాస్ అక్రమ సంబంధం గురించి ప్రియాంకకు తెలిసిందని, అందుకే అతనికి దూరంగా ఉంటోందని రూమర్ అల్లేశాడు. అది కాస్త నెట్టింట్లో వైరల్ అయింది.

ఇక తాజాగా మెట్ గాలాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాసాగాయి. అందులో డైమండ్ నెక్లెస్‌ను ధరించిన ప్రియాంక చోప్రా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ డైమండ్ నెక్లెస్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని విలువ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. 25 మిలియన్ డాలర్లతో ఈ డైమండ్ నెక్లెస్‌ను చేయించారట.

Also Read:  Akhil Agent : నాగ చైతన్య కంటే దారుణంగా అఖిల్.. ఇక సమంత అయితే అంతకు మించి

అంటే ఇండియన్ కరెన్సీలో దాని విలువ దాదాపుగా రూ. 204 కోట్లు అని తెలుస్తోంది. ఇంత మొత్తంలో పెట్టి ప్రియాంక చోప్రా ఆ ఈవెంట్‌కు నెక్లెస్‌ను ధరించింది అంటే.. గ్లోబల్ బ్యూటీ రేంజ్ ఏంటో అందరికీ అర్థం అవుతోంది. ఇక ఈ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా అందాల ఆరబోత కూడా హాట్ టాపిక్ అయింది.

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News