Pooja Hegde Leg Injury : పూజా హెగ్డే ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. తన కాలికి గాయం అవ్వడంతో ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. గత నెల చివరి వారంలో తనకు కాలికి గాయమైనట్టుగా, కట్టుకట్టినట్టుగా ఓ ఫోటోను చూయించింది. అయితే ఇంకా పూజా హెగ్డే కాలి గాయం మానలేదని తెలుస్తోంది. తాజాగా పూజా హెగ్డే ఓ పోస్ట్ వేసింది. అందులో తన కాలి ప్రస్తుత పరిస్థితిని వివరించింది.
పూజా హెగ్డే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్‌లోనే పూజా హెగ్డే తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. ఈ మూవీ షూటింగ్‌లోనే పూజా హెగ్డే కాలికి గాయమైనట్టు తెలుస్తోంది.
అయితే తాజాగా పూజా హెగ్డే తాజాగా ఓ పోస్ట్ వేసింది. నా ఉదయం ఇలా మొదలైంది.. రికవరీ అవుతున్నా.. మళ్లీ స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను అంటూ పూజా హెగ్డే పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పూజా హెగ్డే బకెట్‌లో కాలు పెట్టే రిలాక్స్ అవుతోంది. అయితే ఇంకా కొన్ని రోజులు పూజా హెగ్డే ఇంట్లోనే ఉండేట్టు కనిపిస్తోంది.
పూజా హెగ్డే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా దర్శకుడు తేజ అయితే పూజా హెగ్డే ఎవరు? అని ప్రశ్నించాడు. ఆమె ఎవరు? నాకు తెలీదు. ఆమె ఏ సినిమాల్లో నటించింది? అంటూ డైరెక్టర్ తేజ అడిగేశాడు. ఇక పూజా హెగ్డేకు ప్రస్తుతం తెలుగులో పెద్ద ప్రాజెక్ట్ అంటూ ఏమీ లేకుండా పోయింది.
పూజా హెగ్డే ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ సినిమా తరువాత రణ్‌వీర్ సింగ్‌తో కలిసి పూజా హెగ్డే నటిస్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే దళపతి విజయ్ వారసుడు సినిమాలో పూజా హెగ్డే నటించాలి. కానీ చివరకు ఆ చాన్స్ రష్మికకు దక్కింది.
Also Read : Shannu-Deepthi : ఇంకా డిప్రెషన్‌లోనే ఉన్నాడా?.. దీప్తిని మరిచిపోలేకపోతోన్న షన్ను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook